వచ్చే ఏడాది మధ్య భాగంలో రానున్న బ్రయో సెడాన్ వెర్షన్
జపనీస్ కార్ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ భారత మార్కెట్లో ఇటీవలే ప్రవేశపెట్టిన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ బ్రయో ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అందులో ఓ సెడాన్ వెర్షన్‌ను కంపెనీ అభివృద్ధి చేస్తోంది. వచ్చే ఏడాది మధ్య భాగం నాటికి హోండా బ్రయో సెడాన్ భారత మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. బ్రయోలో సెడాన్ వెర్షన్ కోరుకునే వారి కోసం, అలాగే ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న సి-సెగ్మెంట్ సెడాన్ హోండా సిటీకు దిగువన తక్కువ ధర కలిగిన ఓ సెడాన్‌ను అందించాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ కారును అభివృద్ధి చేస్తోంది.
ఆశ్చర్యకర విషయం ఏంటంటే, హోండా బ్రయో సెడాన్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభ్యం కావచ్చని మార్కెట్ వర్గాల సమాచారం. ఇప్పటి వరకూ హోండాకు డీజిల్ కార్ పోర్ట్‌ఫోలియో లేదు. ఇదే గనుక నిజమైతే ఇండియన్ మార్కెట్లో హోండా నుంచి లభ్యం కానున్న మొట్టమొదటి డీజిల్ కారు హోండా బ్రయో కానుంది. ప్రస్తుతం దేశీయ విపణిలో లభిస్తున్న హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించిన 4-సిలిండర్, 1.2 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌నే పెట్రోల్ వెర్షన్ బ్రయో సెడాన్‌లోను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.

ఇది 6000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 88 పిఎస్‌ల శక్తిని, 4500 ఆర్‌పిఎమ్ వద్ద 109 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బ్రయో హ్యాచ్‌బ్యాక్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. డీజిల్ వెర్షన్ బ్రయో సెడాన్ విషయానికి వస్తే.. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఈ ఇంజన్ సాంకేతిక వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. అయితే, ఇంజన్‌ను బ్రయో హ్యాచ్‌బ్యాక్ వెర్షన్‍లో కూడా ఉపయోగించవచ్చని తెలుస్తోంది.
హోండా బ్రయో సెడాన్‌ను త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయటాన్ని సూచిస్తూ కంపెనీ ఇప్పటికే తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఓ టీజర్‌ను విడుదల చేసింది. ఎక్సైజ్ సుంఖాల రాయితీని పొందేందుకు గాను హోండా బ్రయో సెడాన్‌ను 4 మీటర్ల పొడవు కన్నా తక్కువగా ఉండేలా (సబ్ ఫోర్-మీటర్) డిజైన్ చేయనున్నారు. కొత్తగా మార్కెట్లోకి రానున్న హోండా బ్రయో సెడాన్ ఈ సెగ్మెంట్లోని టాటా ఇండిగో ఈసిఎస్, కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, త్వరలో మార్కెట్లోకి రానున్న సబ్ ఫోర్-మీటర్ మహీంద్రా వెరిటో వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది.


Click it and Unblock the Notifications








