హోండా సివిక్ కారుపై రూ.1.6 లక్షల డిస్కౌంట్!
హోండా కార్స్ ఇండియా అందిస్తున్న ప్రీమియం సెడాన్ హోండా సివిక్‌పై ఇప్పుడు భారీ డిస్కౌంట్ లభిస్తోంది. సాధారణంగా హోండా కార్లపై ధర తగ్గింపు, డిస్కౌంట్‌లు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. డీజిల్ కార్ పోర్ట్‌ఫోలియో లేనప్పటికీ, కేవలం పెట్రోల్ కార్లతోనే అమ్మకాల పరంగా అదరహో అనిపించుకుంటున్న హోండా, ఇప్పుడు తమ సివిక్ సెడాన్ కొనుగోలుదారులకు రూ.1.6 లక్షల ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తోంది.
హోండా సివిక్ కొనుగోలుదారులు ఇప్పుడు ఆన్-రోడ్ ధరపై సుమారు 12 నుంచి 14 శాతం తగ్గింపును పొందవచ్చు. ఈ విలువ సుమారు రూ.1.6 లక్షలుగా ఉంటుంది. ఈ మొత్తంలో నగదు తగ్గింపు, ఎక్సేంజ్ బోనస్, ఒక్క సంవత్సరం పాటు ఉచిత ఇన్సూరెన్స్‌లు కలిసి ఉంటాయి. ఒకవేళ తమ పాత కారును ఎక్సేంజ్ చేసుకోని వినియోగదారులు సదరు ఎక్సేంజ్ బోనస్ మొత్తాన్ని నగదు తగ్గింపు రూపంలో పొందవచ్చు.

హోండా సివిక్ - ఎక్స్టీరియర్

హోండా సివిక్ - ఎక్స్టీరియర్

హోండా సివిక్ - ఇంటీరియర్

హోండా సివిక్ - ఎక్స్టీరియర్

హోండా సివిక్ - ఎక్స్టీరియర్

హోండా సివిక్ - ఇంటీరియర్

హోండా సివిక్ - ఎక్స్టీరియర్

హోండా సివిక్ - ఎక్స్టీరియర్
హోండా తాజాగా ఎర్త్‌డ్రీమ్స్ బ్రాండ్‌తో అభివృద్ధి చేసిన అధునాతన 1.6 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్‌ను కొత్తగా రానున్న హోండా సివిక్‌లో కంపెనీ అమర్చనున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్ హోండా సివిక్‌ను కంపెనీ మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం హోండా సివిక్ స్టాక్‌ను క్లియర్ చేసే దిశలో భాగంగా సివిక్ సెడాన్‌పై హోండా ఈ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. ఏదేమైనప్పటికీ, సరసమైన ధరకే పెట్రోల్ వెర్షన్ హోండా సివిక్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదే సరైన సమయం.
అయితే, డీజిల్ వెర్షన్ సివిక్ కావాలనుకునే వారు మాత్రం మరికొంత కాలం వేచి ఉండాల్సిందే. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న హోండా సివిక్ సెడాన్ ధర రూ.12.59 లక్షల నుంచి రూ.14.88 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. పెట్రోల్ వెర్షన్ సివిక్‌లో 132 బిహెచ్‌పి 1.8 లీటర్ ఐ-విటెక్ ఇంజన్‌ను ఉపయోగించారు.


Click it and Unblock the Notifications








