బ్రయోకు దిగువన చిన్న కారును ప్రవేశపెట్టనున్న హోండా

By Ravi

చిన్న కార్ సెగ్మెంట్లో అగ్గి రాజేసేందుకు మరో బుజ్జి కారు రాబోతుంది. జపనీస్ ఆటోమొబైల్ కంపెనీ హోండా మోటార్స్ భారత మార్కెట్లో అందిస్తున్న బ్రయోకు దిగువన తక్కువ ధరకే కారును అందించాలనే ఉద్దేశ్యంతో ఓ చిన్న కారును అభివృద్ధి చేయనుంది. కంపెనీ గ్లోబల్ మార్కెట్లలో అందిస్తున్న ఎన్-సిరీస్ కార్ల ఫ్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకొని ఈ చిన్ని కారు తయారు చేసే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చైనా, థాయ్‌లాండ్, ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, భవిష్యత్తులో ఇలాంటి చిన్న కార్లకు మంచి డిమాండ్ ఉండవచ్చిని హోండా భావిస్తోంది.

హోండా ఎన్-సిరీస్ కారు చూడటానికి చిన్నదిగా ఉన్నప్పటికీ, విశాలమైన ఇంటీరియర్ స్పేస్‌ను కలిగి ఉండి, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇది చూడటానికి మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారును పోలి ఉంటుంది. హోండా ఎన్-సిరీస్‌లో ఎన్-బాక్స్, ఎన్-బాక్స్ ప్లస్, ఎన్-వన్ అనే కార్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఎన్-బాక్స్, ఎన్-బాక్స్ ప్లస్ చిన్న కార్లు వాటి పేర్లకు తగినట్లుగానే పెట్టె ఆకారంలో ఉండి, ఎక్కువగా వాణిజ్య రవాణా అవసరాల కోసం ఉపయోగించబడుతుంటాయి.

అయితే, హోండా ఎన్-వన్ కారును పూర్తిగా మాత్రం ప్యాసింజర్ కారుగా ఉపయోగించబడుతుంది. జపాన్ మార్కెట్లో ఈ ఎన్-సిరీస్ కార్లు మంచి ప్రాచుర్యాన్ని కలిగి ఉన్నాయి. ఇవి చిన్నపాటి టర్బోఛార్జ్‌డ్ (600-700సీసీ) పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తాయి. ఈ చిన్న ఇంజన్లు మంచి పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేయటమే కాకుండా, మెరుగైన మైలేజ్‌ను కూడా అందిస్తాయి. వాస్తవానికి మన ఇండియన్ రోడ్లకు ప్రధానంగా కావల్సినవి కూడా ఈ రెండు ఫీచర్లే.

హోండా ఎన్-వన్

హోండా ఎన్-వన్

హోండా ఎన్-వన్

హోండా ఎన్-వన్

హోండా ఎన్-వన్

హోండా ఎన్-వన్

హోండా ఎన్-వన్

హోండా ఎన్-వన్

హోండా ఎన్-వన్

హోండా ఎన్-వన్

హోండా ఎన్-వన్

హోండా ఎన్-వన్

హోండా ఎన్-వన్

హోండా ఎన్-వన్

హోండా ఎన్-వన్

హోండా ఎన్-వన్

హోండా ఎన్-వన్

హోండా ఎన్-వన్

హోండా ఎన్-వన్

హోండా ఎన్-వన్

హోండా ఎన్-వన్

హోండా ఎన్-వన్

హోండా ఎన్-వన్

హోండా ఎన్-వన్


నానాటికీ పెరుగుతు వాహనాల సంఖ్యను గమనిస్తే, పరిమాణంలో తక్కువ ఉండే వాహనాలకు అలాగే, నిరంతరాయంగా పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో ఎక్కువ మైలేజినిచ్చే వాహనాలకు భవిష్యత్తులో మంచి ఉండబోతుంది. జపనీస్ మార్కెట్లో ఈ పెట్రోల్ కార్లు లీటరుకు 27 కి.మీ. మైలేజీనిస్తాయి. అక్కడి మార్కెట్లో ఇవి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో కూడా లభ్యమవుతాయి. భారత మార్కెట్లో విడుదల కానున్న ఎన్-సిరీస్ కార్లు 20-25 కి.మీ. మైలేజినిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

కాగా.. హోండా గతంలో ఇదివరకెన్నడూ లేని విధంగా, తమ మొట్టమొదటి డీజిల్ కారును భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. హోండా బ్రయో ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా కంపెనీ థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదల చేసిన హోండా అమేజ్ సెడాన్‌ను వచ్చే ఏడాది ఆరంభంలో దేశీయ విపణిలో కూడా విడుదల చేయనుంది. భారత మార్కెట్లో హోండా పటిష్టమైన మార్కెట్ వాటాను చేజిక్కించుకోవాలంటే, ఇలాంటి చిన్న వాహనాలను ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Thursday, November 29, 2012, 12:53 [IST]
English summary
Hinting its interest in the entry level small car segment, Japanese carmaker Honda is developing a new car that is smaller than the Brio hatchback. Honda had earlier indicated that it would focus on high volume segments in emerging markets like India, China and South East Asia. Honda's new small car will be based on the N-Series platform.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+