జనవరి 2013 నుంచి బ్రయో, సిటీ ధరల పెంపు: హోండా

By Ravi

కొత్త సంవత్సరంలో కొత్త కార్ల ధరలను పెంచనున్న కార్ కంపెనీల జాబితాలో తాజాగా హోండా కార్స్ ఇండియా (గతంలో హోండా సియోల్ కార్స్ ఇండియా) కూడా చేరిపోయింది. జనవరి 2013 నుంచి తమ చిన్న కారు బ్రయో హ్యాచ్‌బ్యాక్, ఎగ్జిక్యూటివ్ సెడాన్ సిటీ ఉత్పత్తుల ధరలు పెంచనున్నామని హోండా కార్స్ ఇండియా ప్రకటించింది. తాజా ధరల పెంపు, ఈ మోడళ్ల ప్రస్తుత ధరపై 0.8 శాతం నుంచి 1.65 సాతం మధ్యలో ఉంటుందని కంపెనీ తెలిపింది. పెరిగిన ఉత్పాదక వ్యయం, ద్రవ్యోల్బణ వత్తిళ్లే ధరల పెంపుకు కారణమని హోండా పేర్కొంది.

ఇప్పటికే మారుతి సుజుకి ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టొయోటా, జనరల్ మోటార్స్, నిస్సాన్ ఇండియా వంటి పలు ఆటోమొబైల్ కంపెనీలు వచ్చే ఏడాది ఆరంభం నుంచి తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. కేవలం ప్యాసింజర్ కార్ కంపెనీలే కాకుండా మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి ఇండియా వంటి లగ్జరీ కార్ కంపెనీలు కూడా జనవరి 2013లో ఉత్పత్తుల ధరలను పెంచనున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తుంటే, కొత్త సంవత్సరంలో కారును కొనుగోలు చేసే కొనుగోలుదారులు అధనంగా తమ జేబులకు చిల్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేలా ఉంది.

Honda City

More from DriveSpark

Article Published On: Monday, December 17, 2012, 12:39 [IST]
English summary
Japanese carmaker Honda Cars India Ltd has announced the price hike its entry level hatchback Brio and executive sedan City from January 2013. Company stated that, the hike range will be 0.8% to 1.65% on their current price. The prices are being revised due to the rising input costs and inflationary pressures.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+