హోండా బ్రయో ఆటోమేటిక్ విడుదల: ఫీచర్లు, ధరలు
భారత్‌లో హోండా కార్స్ అందిస్తున్న మొట్టమొదటి చిన్న కారు బ్రయోలో ఓ ఆటోమేటిక్ వెర్షన్‌ను కంపెనీ నేడు మార్కెట్లో విడుదల చేసింది. హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్ ఇప్పటి వరకూ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తోనే లభ్యమవుతోంది. హోండా ఆటోమేటిక్ కార్లకు మార్కెట్లో డమంచి డిమాండ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో కొత్త బ్రయోకు హోండా విడుదల చేసింది. అయితే, కొత్త హోండా బ్రయో ఆటోమేటిక్‌లో ఇంజన్ పరంగా, డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు.
హోండా బ్రయో ఆటోమేటిక్ రెండు వేరియంట్లలో (ఎస్(ఓ), వి) లభ్యమవుతోంది. ఇందులో 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌ను ఉపయోగించారు. బ్రయో ఆటోమేటిక్‌లో రద్దీగా ఉండే సిటీ రోడ్లపై తరచూ గేరు మార్చాల్సిన అసరం లేకుండా, చికాకులు లేకుండా హాయిగా ప్రయాణించవచ్చు. హోండా బ్రయో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్ల ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
- హోండా బ్రయో ఎస్(ఓ) ఆటోమేటిక్ - రూ. 5.74 లక్షలు
- హోండా బ్రయో వి ఆటోమేటిక్ - రూ. 5.99 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

హోండా బ్రయో ఆటోమేటిక్ - ధరలు
హోండా బ్రయో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
* హోండా బ్రయో ఎస్(ఓ) ఆటోమేటిక్ - రూ. 5.74 లక్షలు
* హోండా బ్రయో వి ఆటోమేటిక్ - రూ. 5.99 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

హోండా బ్రయో ఈఎక్స్ ఎమ్‌టి
ఆటోమేటిక్ వేరియంట్‌తో పాటుగా బ్రయోలో హోండా మరొక కొత్త మ్యాన్యువల్ వేరియంట్ (ఈఎక్స్)ను కూడా పరిచయం చేసింది. హోండా బ్రయో ఈఎక్స్ వేరియంట్‌లో మరిన్ని కొత్త ఫీచర్లను జోడించి ధరకు తగిన విలువతో కంపెనీ దీనిని ఆఫర్ చేస్తోంది.

హోండా బ్రయో ఈఎక్స్ ఎమ్‌టి - ఫీచర్లు
* ఫ్రంట్ స్పీకర్లతో కూడిన 1 డిన్ ఆడియో సిస్టమ్ (ఏఎమ్/ఎఫ్ఎమ్, ఎమ్‌పి3, యూఎస్‌బి, ఆక్స్-ఇన్ సపోర్ట్‌తో)
* బాడీ కలర్డ్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ (ఓవిఆర్ఎమ్)
* బాడీ కలర్డ్ అవుట్‌సైడ్ డోర్ హ్యాండిల్స్, డోర్ సిటిఆర్ సాష్ టేప్
* హోండా బ్రయో ఈఎక్స్ వేరియంట్ ధర - రూ. 4.26 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

హోండా బ్రయో ఆటోమేటిక్ - ఇంజన్
* 4-సిలిండర్, 1.2 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్
* 6000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 88 పిఎస్‌ల శక్తి
* 4500 ఆర్‌పిఎమ్ వద్ద 109 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్

హోండా బ్రయో ఆటోమేటిక్ - మైలేజ్
* మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వెర్షన్ బ్రయో మైలేజ్ - 18.4 కెఎమ్‌పిఎల్
* ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వెర్షన్ బ్రయో మైలేజ్ - 16.5 కెఎమ్‌పిఎల్

హోండా బ్రయో - సర్వీసింగ్
హోండా బ్రయో ఇప్పుడు 'హోండా కేర్ మెయింటినెన్స్ ప్యాకేజ్' (హెచ్‌సిఎమ్‌పి)తో 40,000 కి.మీ. లేదా 2 ఏళ్ల పాటు ఉచిత సర్వీసింగ్‌తో లభ్యం కానుంది. కస్టమర్లు ఈ హెచ్‌సిఎమ్‌పి ప్యాకేజ్‌ను రూ. 9,996 చెల్లించి కొనుగోలు చేయవచ్చు.

హోండా బ్రయో ఎస్ వేరియంట్
హోండా బ్రయో ఎస్ వేరియంట్ ఇప్పుడు పవర్ అడ్జస్టబల్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, ఫ్రంట్ అండ్ రియర్ మడ్‌గార్డ్స్‌తో లభ్యం కానుంది. ఇకపై హోండా బ్రయో మొత్తం ఏడు వేరియంట్లలో (ఈ ఎమ్‌టి, ఈఎక్స్ ఎమ్‌టి, ఎస్ ఎమ్‌టి, ఎస్(ఓ) ఎమ్‌టి, ఎస్(ఓ) ఏటి, వి ఎమ్‌టి, వి ఏటి) లభ్యమవుతుంది.

హోండా బ్రయో - సేఫ్టీ ఫీచర్లు
* డ్యూయెల్ ఎస్ఆర్ఎస్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్
* యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్)
* ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి)
* ఫ్రంట్ ప్రీ-టెన్షనర్ సీట్ బెల్ట్స్

హోండా బ్రయో వేరియంట్లు, ధరలు:
* హోండా బ్రయో ఈ ఎమ్‌టి - రూ. 4.06 లక్షలు
* హోండా బ్రయో ఈఎక్స్ ఎమ్‌టి - రూ. 4.26 లక్షలు
* హోండా బ్రయో ఎస్ ఎమ్‌టి - రూ. 4.55 లక్షలు
* హోండా బ్రయో ఎస్(ఓ) ఎమ్‌టి - రూ. 4.99 లక్షలు
* హోండా బ్రయో ఎస్(ఓ) ఏటి - రూ. 5.74 లక్షలు
* హోండా బ్రయో వి ఎమ్‌టి - రూ. 5.24 లక్షలు
* హోండా బ్రయో వి ఏటి - రూ. 5.99 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
ఆటోమేటిక్ వేరియంట్‌తో పాటుగా బ్రయోలో హోండా మరొక కొత్త మ్యాన్యువల్ వేరియంట్ (ఈఎక్స్)ను కూడా పరిచయం చేసింది. హోండా బ్రయో ఈఎక్స్ వేరియంట్‌లో మరిన్ని కొత్త ఫీచర్లను జోడించి ధరకు తగిన విలువతో కంపెనీ దీనిని ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా, హోండా బ్రయో ఇప్పుడు 'హోండా కేర్ మెయింటినెన్స్ ప్యాకేజ్' (హెచ్‌సిఎమ్‌పి)తో 40,000 కి.మీ. లేదా 2 ఏళ్ల పాటు ఉచిత సర్వీసింగ్‌తో లభ్యం కానుంది. కస్టమర్లు ఈ హెచ్‌సిఎమ్‌పి ప్యాకేజ్‌ను రూ. 9,996 చెల్లించి కొనుగోలు చేయవచ్చు.
హోండా బ్రయోలో అమర్చిన 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ కారు ప్రయాణించే వేగం, కారు లోపల బరువు, నడిపే పరిస్థితులను బట్టి ఆటోమేటిక్‌గా గేరు మార్చుకోవటం జరుగుతుంది. హోండా బ్రయోలో ఉపయోగించిన 4-సిలిండర్, 1.2 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 88 పిఎస్‌ల శక్తిని, 4500 ఆర్‌పిఎమ్ వద్ద 109 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వెర్షన్ బ్రయో లీటర్ పెట్రోల్‌కు 18.4 కి.మీ. మైలేజీని, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వెర్షన్ బ్రయో లీటరుకు 16.5 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.
హోండా కార్స్ కొత్తగా ఆఫర్ చేస్తున్న బ్రయో ఈఎక్స్ వేరియంట్‌లో ఫ్రంట్ స్పీకర్లతో కూడిన 1 డిన్ ఆడియో సిస్టమ్ (ఏఎమ్/ఎఫ్ఎమ్, ఎమ్‌పి3, యూఎస్‌బి, ఆక్స్-ఇన్ సపోర్ట్‌తో), బాడీ కలర్డ్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ (ఓవిఆర్ఎమ్), బాడీ కలర్డ్ అవుట్‌సైడ్ డోర్ హ్యాండిల్స్, డోర్ సిటిఆర్ సాష్ టేప్ వంటి ఫీచర్లతో ఇది సరికొత్త లుక్‌ని కలిగి ఉండి, మంచి సౌకర్యాన్ని ఆఫర్ చేస్తూ, ధరకు తగిన విలువను కలిగి ఉంటుంది. హోండా బ్రయో ఈఎక్స్ వేరియంట్ ధర రూ. 4.26 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
అలాగే, హోండా బ్రయో ఎస్ వేరియంట్ ఇప్పుడు పవర్ అడ్జస్టబల్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, ఫ్రంట్ అండ్ రియర్ మడ్‌గార్డ్స్‌తో లభ్యం కానుంది. ఇకపై హోండా బ్రయో మొత్తం ఏడు వేరియంట్లలో (ఈ ఎమ్‌టి, ఈఎక్స్ ఎమ్‌టి, ఎస్ ఎమ్‌టి, ఎస్(ఓ) ఎమ్‌టి, ఎస్(ఓ) ఏటి, వి ఎమ్‌టి, వి ఏటి) లభ్యమవుతుంది. హోండా బ్రయోలే డ్యూయెల్ ఎస్ఆర్ఎస్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఫ్రంట్ ప్రీ-టెన్షనర్ సీట్ బెల్ట్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
హోండా బ్రయో వేరియంట్లు, ధరలు:
- హోండా బ్రయో ఈ ఎమ్‌టి - రూ. 4.06 లక్షలు
- హోండా బ్రయో ఈఎక్స్ ఎమ్‌టి - రూ. 4.26 లక్షలు
- హోండా బ్రయో ఎస్ ఎమ్‌టి - రూ. 4.55 లక్షలు
- హోండా బ్రయో ఎస్(ఓ) ఎమ్‌టి - రూ. 4.99 లక్షలు
- హోండా బ్రయో ఎస్(ఓ) ఏటి - రూ. 5.74 లక్షలు
- హోండా బ్రయో వి ఎమ్‌టి - రూ. 5.24 లక్షలు
- హోండా బ్రయో వి ఏటి - రూ. 5.99 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








