థాయ్‌లాండ్ మార్కెట్లో హోండా సిటీ సిఎన్‌జి విడుదల

జపనీస్ కార్ కంపెనీ హోండా మోటార్స్ బెస్ట్ సెల్లింగ్ మోడల్ హోండా సిటీలో ఓ సిఎన్‌జి (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) వేరియంట్‌ను విడుదల చేయనున్నట్లు మేము ఇదిరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు సరికొత్త సిఎన్‌జి వెర్షన్ హోండా సిటీ సెడాన్‌ను కంపెనీ థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదల చేసింది. మరికొద్ది రోజుల్లోనే ఈ సిఎన్‌జి వెర్షన్ సిటీ భారత మార్కెట్లోకి కూడా రానుంది.

హోండా గతంలో, రిఫ్రెష్డ్ వెర్షన్ 2012 హోండా సిటీని కూడా ఇండియన్ మార్కెట్లో విడుదల చేయటానికి ముందు తొలుత థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదల చేసింది. అనంతరం, భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇదే విధంగా, సిఎన్‌జి వెర్షన్ హోండా సిటీని కూడా ముందుగా థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదల చేసిన తర్వాతనే ఇండియన్ మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది.

హోండా సిటీలో కేవలం పెట్రోల్ వెర్షన్ మాత్రమే అందుబాటులో, ఇదే సమయంలో ఈ సెగ్మెంట్లోని పోటీదారులు విభిన్న ఇంజన్ ఆప్షన్లను అందిస్తుండటంతో సిటీ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో త్వరలో మార్కెట్లోకి రానున్న హోండా సిటీ సిఎన్‌జి వలన మళ్లీ సిటీ సెడాన్ అమ్మకాలు జోరుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీజిల్ వెర్షన్ హోండా సిటీ 2013లో అందుబాటులోకి రావచ్చని అంచనా.


సిఎన్‌జి వెర్షన్ హోడా సిటీ ఇంటీరియర్స్‌లో పెద్దగా మార్పులు ఏమీ ఉండవు. ఇందులో సిఎన్‌జి కిట్‌ను అమర్చేందుకు ఇంజన్‌లో తగిన మార్పులు చేయటం జరుగుతుంది. సిఎన్‌జితో నడిచే వాహనాల రన్నింగ్ కాస్ట్ సాధారణ ఇంధనాలతో నడిచే వాహనాలతో పోల్చుకుంటే తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం లభిస్తున్న పెట్రోల్ వేరియంట్ సిటీ ధరతో పోల్చుకుంటే, సిఎన్‌జి వెర్షన్ సిటీ ధర సుమారు రూ.60,000 వరకూ అధికంగా ఉంటుంది.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న పెట్రోల్ వెర్షన్ హోండా సిటీ సెడాన్ ధర రూ.7.25 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండగా, సిఎన్‌జి వెర్షన్ హోండా సిటీ సెడాన్ ధర రూ.7.85 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండొచ్చని అంచనా. హోండా సిటీలో అమర్చిన 1.5 లీటర్ ఐ-విటెక్ ఇంజన్ గరిష్టంగా 116 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. అయితే, సిఎన్‌జి ఇంధనాన్ని ఉపయోగించడం వలన పవర్‌ 5 నుంచి 10 శాతం తగ్గే అవకాశం ఉంది.

ఫోక్స్‌వ్యాగన్ వెంటో, స్కొడా ర్యాపిడ్, మారుతి సుజుకి ఎస్ఎక్స్4, హ్యుందాయ్ వెర్నా, ఫోర్డ్ ఫియస్టా వంటి మిడ్-సైజ్ సెడాన్లకు హోండా సిటీ గట్టి పోటీ ఇస్తోంది.

2012 హోండా సిటీ ఫోటో గ్యాలరీ:

ప్రస్తుతం హోండా సిటీలో లభిస్తున్న వేరియంట్ల వాటి ధరల (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) వివరాలు ఇలా ఉన్నాయి:
* Honda City Corporate : INR 737,500
* Honda City 1.5 E MT : INR 796,000
* Honda City 1.5 S MT : INR 850,000
* Honda City 1.5 V MT : INR 903,500
* Honda City SAT : INR 925,500
* Honda City 1.5 V AT : INR 979,000
* Honda City 1.5 V MT Sunroof : INR 989,000
* Honda City 1.5 V AT Sunroof : INR 1,064,500

More from DriveSpark

Article Published On: Friday, August 31, 2012, 14:48 [IST]
English summary
As we reported earlier about Honda City CNG variant, now the Japanese car maker has launched the CNG version of Honda City in Thailand. It is expected to hit the Indian roads soon.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+