తక్కువ ధర కలిగిన హోండా సిటీ ఆటోమేటిక్ విడుదల
జపాన్ కార్ బ్రాండ్ హోండా గతేడాది డిసెంబర్ నెలలో రూ.6.99 లక్షల ప్రారంభ ధరకే సరికొత్త సిటీ సెడాన్‌ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో కేవలం టాప్ ఎండ్ వేరియంట్‌లో మాత్రమే కంపెనీ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ కలిగి వేరియంట్‌ను (హోండా సిటీ వి ఏటి) మార్కెట్లో ప్రవేశపెట్టింది.
అయితే.. ఈ వేరియంట్ ధర అధికంగా ఉండటం, ఆటోమేటిక్ వేరియంట్ సిటీ సెడాన్‌కు మంచి డిమాండ్ ఉండటంతో ఓ మిడ్-లెవర్ వేరియంట్ ఆటోమేటిక్ వేరియంట్ సిటీని కంపెనీ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. హోండా సిటీ ఎస్ ఏటి పేరుతో మార్కెట్లోకి విడుదలైన ఈ కొత్త మిడ్-లెవల్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.9.09 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
దాదాపు రూ.10 లక్షల ఆన్-రోడ్ ధరకే ఈ ఆటోమేటిక్ హోండా సిటీ సెడాన్‌ను సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ సెగ్మెంట్లో ఇతర పోటీదారులు అందిస్తున్న కార్లతో పోల్చుకుంటే హోండా సిటీ ధర కాస్తంత ఎక్కువనే చెప్పాలి. మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లోని ఫోర్డ్ ఫియస్టా స్టయిల్ ఆటోమేటిక్ ధర రూ.9.14 లక్షలుగా ఉండగా, స్కొడా ర్యాపిడ్ యాంబిషన్ ధర రూ.8.42 లక్షలుగా ఉంది.
ఈ సరికొత్త ఆటోమేటిక్ వెర్షన్ హోండా సిటీలో ఇంజన్ పరంగా, డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు కేవలం ట్రాన్సిమిషన్‌లో మాత్రమే కంపెనీ మార్పులు చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. హోండా సిటీ ఎస్ ఆటోమేటిక్‌లో పాపులర్ 1.5 లీటర్ ఐ-విటెక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టం 116.3 బిహెచ్‌పిల శక్తిని, 146 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు సుమారు 16 కి.మీ. మైలేజీనిస్తుంది.


Click it and Unblock the Notifications








