బ్రయో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా హోండా నుంచి చీప్ సెడాన్!
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా సియోల్ కార్స్ ఇండియా లిమిటెడ్ ఇటీవలే భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన బుజ్జి కారు హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని ఓ సెడాన్‌ను దేశీయ విపణిలో విడుదల చేయాలని కంపెనీ సన్నాహాలు చేస్తోంది. గతేడాది మార్కెట్లోకి ప్రవేశించిన హోండా బ్రయో చిన్న కారు భారతీయుల అభిమానాన్ని సొంతం చేసుకొని మంచి సక్సెన్‌ను సాధించడంతో ఈ మోడల్ ఆధారంగా మరిన్ని వేరియంట్‌లను తీసుకువచ్చేందుకు హోండా సన్నాహాలు చేస్తుంది.
హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్ ఇంటీరియర్ స్పేస్ పరంగా మంచి సౌకర్యంగా ఉన్నప్పటికీ బూట్ స్పేస్ విషయంలో మాత్రం వినియోగదారులను కొద్దిగా నిరుత్సాపరుస్తుంది. ఇలాంటి కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని ఎక్కువ బూట్ స్పేస్ ఉండేలా ఇందులో ఓ సెడాన్ వేరియంట్‌ను హోండా తీసుకురానుంది. హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్ ఇంటీరియర్ స్పేస్ ఇంచుమించు ఓ ఎమ్‌పివిలో ఉండే స్పేస్‌ను తలపిస్తుంది. అందుకే, ఈ మోడల్ ఆధారంగా ఓ ఎమ్‌పివిని కూడా హోండా అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతాని హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్ కేవలం పెట్రోల్ వేరియంట్‌లో మాత్రమే లభ్యమవుతుంది. నాలుగు వేరియంట్లలో లభ్యమయ్యే హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్ ఎక్స్-షోరూమ్, హైదరాబాద్ ధరలు ఈ విధగా ఉన్నాయి.
* Honda Brio E MT : Rs. 408,000
* Honda Brio S MT : Rs. 449,000
* Honda Brio S(O) MT : Rs. 504,000
* Honda Brio V MT : Rs. 529,000
హోండా బ్రయో ప్రారంభ ధర రూ.3.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండటంతో ప్రస్తుతం హోండా సియోల్ నుంచి లభిస్తున్న అత్యంత చవక కారు బ్రయో హ్యాచ్‌బ్యాక్‌గా ఉంది. కాగా.. హోండా సిటీ సెడాన్‌కు దిగువన చవక ధరకే ఓ సెడాన్‌ను అందిచాలనే ఉద్దేశ్యంతో బ్రయో హ్యాచ్ ఆధారంగా బ్రయో సెడాన్‌కు కంపెనీ రూపకల్పన చేయనుంది. ఇది ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, టొయోటా ఎతియోస్, టాటా మాంజా వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది.
రానున్న 2013 నాటికి హోండా చవక సెడాన్ ఇండియన్ మార్కెట్లో లభ్యమయ్యే ఆస్కారం ఉంది. ఇక దీని సాంకేతిక వివరాలు, ధరల గురించి కంపెనీ నోరు మెదపకపోయినప్పటికీ, ఇది సుమారు రూ.7 లక్షల కన్నా దిగువన ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, ప్రారంభంలో భాగంగా హోండా బ్రయో సెడాన్ పెట్రోల్ వేరియంట్‌లో మాత్రమే లభ్యవుతుంది. అనంతరం, హోండా నుంచి ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఎర్త్ డ్రీమ్ సిరీస్ డీజిల్ ఇంజన్‌ను ఈ కొత్త సెడాన్‌లో ఉపయోగించవచ్చు.


Click it and Unblock the Notifications








