డెట్రాయిట్‌లో కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించనున్న హోండా
జపనీస్ కార్ కంపెనీ హోండా మోటార్ కార్పోరేషన్, వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న డెట్రాయిట్ మోటార్ షోలో ఓ సరికొత్త కాన్సెప్ట్ కారును ఆవిష్కరించనుంది. యుటిలిటీ వాహన సెగ్మెంట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు డిమాండ్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, హోండా తాజాగా అభివృద్ధి చేసిన కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను అమెరికాలో జరగనున్న 2013 డెట్రాయిట్ మోటార్ షోలో హోండా ప్రదర్శించనుంది. హోండా కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ ప్రొడక్షన్ రూపం దాల్చడానికి మరో రెండు మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.
హోండా అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ జాజ్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, కంపెనీ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేసినట్లు సమాచారం. గ్లోబల్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని, ఈ అర్బన్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను వినియోగదారులకు అభిరుచులకు అనుగుణంగా, అధునాతం సాంకేతి పరిజ్ఞానాన్ని ఉపయోగించి హోండా రూపొందించింది. హోండా ఇప్పటికే తమ కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది. యూరోపియన్ మార్కెట్ల కోసం ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని స్విన్‌డన్‌లోని ప్లాంటులో ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఈ కొత్త కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే..!


Click it and Unblock the Notifications









