వాహనం యొక్క రిజిస్ట్రేషన్ చిరునామాను మార్చటం ఎలా?

By Ravi

వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత, వాహన యజమాని పాత చిరునామా నుంచి కొత్త చిరునామాకు మారినట్లయితే, వాహనం యొక్క రిజిస్ట్రేషన్ చిరునామాను మార్చుకోవటం కూడా తప్పనిసరి. ఇలా వాహన రిజిస్ట్రేషన్ చిరునామాను మార్చుకోకపోవటం వలన వాహనానికి సంబంధించిన కమ్యూనికేషన్ సదరు వాహన యజమానికి చేరదు మరియు చట్టరీత్యా నేరం కూడా అవుతుంది.

సాధారణంగా అద్దె ఇళ్లలో నివసించే వారు తరచూ తమ నివాస స్థలాన్ని మార్చుతూ ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాహనం యొక్క రిజిస్ట్రేషన్ చిరునామాను మార్చుకోవటం ఎలాగో తెలియక కొందరు మధ్యవర్తులను, ఆర్టీఓ బ్రోకర్లను ఆశ్రయించి జేబులకు చిల్లు పెట్టుకుంటుంటారు. అలాంటి వారి కోసమే ఈ కథనంలో వాహన రిజిస్ట్రేషన్ అడ్రస్‌ను మార్చుకోవటం ఏలానో తెలియజేస్తున్నాం..!

చిరునామా మార్పు:
ఏదైనా మోటార్ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్.సి.)లో చిరునామాను మార్చాలనుకుంటే, సదరు వాహన యజమాని ద్వారానే ఇది చేయాలి. ఇందుకోసం సదరు వాహన యజమాని ఫారమ్ 33ని నింపి, ఆర్టీఓ కార్యాలయంలో రూ.20/- రుసుము చెల్లించాలి. ఈ అప్లికేషన్‌తో పాటుగా వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, చిరునామా సాక్ష్యాల (అడ్రస్ ప్రూఫ్) కాపీలను జతచేయాలి. (ఒరిజినల్స్ కూడా తమ వెంట తీసుకువెళ్లటం మంచిది).

How To Change Registration Address Of A Vehicle

వాహనాన్ని ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మార్చుకోవాలంటే..?
మోటార్ వాహన చట్టం 1998లోని సెక్షన్ 47 ప్రకారం, ఏదైనా మోటార్ వాహనాన్ని వేరొక రాష్ట్రానికి మార్చుకోవాలనుకుంటే, వాహనం ఉపయోగించబోయే సదరు రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ నెంబర్‌ను కేటాయించడానికి ఈ సెక్షన్ సహకరిస్తుంది. ఇందులో భాగంగా, వాహనాన్ని వేరొక రాష్ట్రానికి మార్చుకోవాలనుకునే వాహన యజమాని సిఎమ్‌వి (సెంట్రల్ మోటార్ వెహికల్) నిబంధనల ప్రకారం 'ఫారమ్ 27'ను అలాగే, మోటార్ వాహన చట్టం 1998లోని సెక్షన్ 48 క్రింద 'ఫారమ్ 28' రూపంలో ఎన్.ఓ.సి.ని ఆర్టీఓ నుండి పొందాల్సి ఉంటుంది.

మోటార్ వాహన చట్టం 1998లోని సెక్షన్ 47 క్రింద వాహనం యొక్క రీ-అసైన్‌మెంట్ కోసం 12 నెలల సమయం ఇవ్వటం జరుగుతుంది. ఈ విధానం కోసం కావల్సిన పత్రాలు:
1. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
2. చిరునామా సాక్ష్యం
3. ఎన్.ఓ.సి. (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్)
4. ఇన్సూరెన్స్ సర్టిఫికెట్
5. పి.యూ.సి (పొల్యూషన్ అండర్ కంట్రోల్) సర్టిఫికెట్
6. టాక్స్ పేమెంట్

More from DriveSpark

Article Published On: Friday, November 30, 2012, 14:26 [IST]
English summary
Getting the registration address of a cehicle changes needs to be done whenver you change your address. Here is a simple procedure on how to change the vehicle's registration address. An application for recording of change in residence in the Certificate of Registration of a Motor Vehicle shall be made by the owner of the vehicle in Form 33 duly paying the appropriate fee of Rs. 20.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+