హైదరాబాద్: కార్లకు సన్ ఫిల్మ్‌లు తొలగించకుంటే జరిమానా

హైదరాబాద్: మీ కారుకు ఇంకా టింటెడ్ గ్లాస్ (సన్ ఫిల్మ్) తొలగించలేదా..? అయితే, జాగ్రత్త మీరు ట్రాఫిక్ పోలీసులకు చిక్కారంటే భారీ జరిమానాలు చెల్లించాల్సి రావచ్చు. నేరాల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో వాహనాలకు నల్లటి ఫిల్ములను (సన్ ఫిల్మ్) తొలగించాల్సిందిగా గడచిన మే నెలలో దేశపు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా దశలవారీగా అమల్లోకి వస్తున్న ఈ విధానం, ఇప్పుడు రాష్ట్ర మార్కెట్లో కూడా అమల్లోకి రానుంది.

నగర రోడ్లపై సంచరించే వాహనాలకు సన్ ఫిల్ములను తొలగించాల్సిందిగా ట్రాఫిక్ పోలీసు భారీ ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ముద్రించిన కరపత్రాలను కూడా కార్ల యజమానులకు పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా, సామాన్యుల వాహనాలకు మొదలుకొని అధికారుల వాహనాల వరకూ సన్ ఫిల్ములను తొలగించాల్సి ఉంటుంది. సన్ ఫిల్ములు తొలగించని వాహనాలపై అక్టోబర్ 25, 2012 నుంచి ట్రాఫిక్ అధికారులు రైడ్ చేయనున్నారు. వీటిని తొలగించిన వాహనాలపై భారీ జరిమానాలను విధించనున్నారు.

Sun Films Banned

దుండగులు వాహనాలకు నల్లటి ఫిల్ములు కలిగిన అద్దాలను ఉపయోగించి తద్వారా అత్యాచారాలు, అపహరణలు మొదలైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో, వీటిని అదుపు చేసేందుకు గానూ వాహనాలకు నల్లటి ఫిల్ముల ఉపయోన్ని సుప్రీం కోర్టు నిషేధించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేసి, వాహనాల అద్దాలకు పరిమితులకు మించి టింట్ చేయబడి ఉన్నట్లయితే జరిమానా విధంచడమే కాకుండా ఆన్‌-ది-స్పాట్‌లోనే సన్‌ఫిల్మ్‌లను తొలగించడం జరుగుతుంది.

"మోటార్ వాహన చట్టం ప్రకారం, కారు విండ్‌స్క్రీన్స్ (ముందు వైపు అద్దం), రియర్ విండో (వెనుక వైపు అద్దం) లపై 70 శాతం విజువల్ లైట్ ట్రాన్స్‌మిషన్ (విఎల్‌టి)ను, కారుకు పక్కల ఉండే అద్దాలకు (కారు డోర్లకు అమర్చిన అద్దాలు) 50 విఎల్‌టిని కలిగి ఉండాలి". సాధారణంగా వాహనాలను తయారు చేసే కంపెనీలు ఈ నియమాన్ని దృష్టిలో ఉంచుకొనే అద్దాలను ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ గ్లాసెస్‌లపై ఏ రకమైన సన్ ఫిల్ములను ఉపయోగించిన అది చట్ట వ్యతిరేకమే అవుతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, October 18, 2012, 12:08 [IST]
English summary
Pamphlets about Ban on Black Film being issued to four wheeler owners in Hyderabad. Fining and enforcement will start from 25 October 2012. Get your vehicle checked today at the nearest Car decor shop for compliance.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+