హ్యుందాయ్ ఐ20 ఫ్లాట్‌ఫామ్‌పై కొత్త ఎంట్రీ లెవల్ సెడాన్!

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో ద్వితీయ స్థానంలో కొనసాగుతున్న హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన అప్‌గ్రేడెడ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ-జెన్ ఐ20 ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఓ ఎంట్రీ లెవల్ సెడాన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం హ్యుందాయ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ సెడాన్ హ్యుందాయ్ యాక్సెంట్‌ ఉత్పత్తిని నిలిపివేయాలని కంపెనీ భావిస్తోంది.

ఈ నేపథ్యంలో, హ్యుందాయ్ యాక్సెంట్ స్థానాన్ని భర్తీ చేస్తూ, ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో ఓ సరికొత్త సెడాన్‌ను ప్రవేశపెట్టాలని హ్యుందాయ్ మోటార్ ఇండియా యోచిస్తోంది. పాత ఐ20తో పోల్చుకుంటే కొత్త ఐ20 డిజైన్ పరంగాను, ఫీచర్ల పరంగాను ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండి, మార్కెట్లో మంచి ఆదరణను సొంతం చేసుకుంది. దీన్నిబట్టి చూస్తే.. హ్యుందాయ్ అందించనున్న ఎంట్రీ లెవల్ సెడాన్ ఐ-జెన్ ఐ20 ఫ్లాట్‌ఫామ్‌ను షేర్ చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

హ్యుందాయ్ తమ కొత్త ఎంట్రీ లెవల్ సెడాన్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవాలంటే, ఇందుకోసం సరికొత్త ఫ్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయడం కన్నా ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఐ20 ఫ్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోవటం ఎంతో ఉత్తమం. అంతేకాకుండా.. హ్యుందాయ్ ఐ-జెన్ ఐ20లో ఉపయోగించిన ఇంజన్లనే ఈ కొత్త సెడాన్‌లో కూడా ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రస్తుతం మారుతి సుజుకి నుంచి లభిస్తున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, స్విఫ్ట్ డిజైర్ సెడాన్‌ల మాదిరిగానే హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా ఐ20 హ్యాచ్‌బ్యాక్, ఐ20 సెడాన్‌లను అందించే ఆస్కారం ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, August 10, 2012, 11:42 [IST]
English summary
According sources, India's second largest car maker Hyundai Motors India is planning bring an entry level sedan based the company's flagship hatchback i-Gen i20. This all new entry level sedan might the replaced version of the existing Hyundai Accent.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+