ఇయాన్‌లో ఎల్‌పిజి వేరియంట్ విడుదల చేసిన హ్యుందాయ్

డ్యాష్ బోర్డుపై అమర్చిన ఓ స్విచ్‌ను ప్రెస్ చేయడం ద్వారా డ్రైవర్ తన ఫ్యూయెల్ ఆప్షన్‌ను మార్చుకోవచ్చు. ఇయాన్‌లో విడుదలైన మూడు ఎల్‌పిజి వేరియంట్లు కూడా సంబంధిత పెట్రోల్ వేరియంట్లతో పోల్చుకుంటే రూ.7,000 నుండి రూ.27,000 వరకూ అధికం.
హ్యుందాయ్ ఇయాన్ ఎల్‌పిజి వేరియంట్లు ధరలు:
* హ్యుందాయ్ ఇయాన్ డి-లైట్ ప్లస్ - రూ.2.98 లక్షలు
* హ్యుందాయ్ ఇయాన్ ఎరా ప్లస్ - రూ.3.12 లక్షలు
* హ్యుందాయ్ ఇయాన్ మాగ్నా ప్లస్ - రూ.3.42 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
హ్యుందాయ్ ఇయాన్ ఎల్‌పిజి వేరియంట్లో డి-లైట్ ప్లస్ బేస్ వేరియంట్. ఇందులో ఎయిర్-కండిషనింగ్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, కారు బాడీ రంగులో ఉండే బంపర్స్, పవర్ స్టీరింగ్‌లు స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌గా వస్తాయి.
హ్యుందాయ్ ఇయాన్ ఎల్‌పిజి ఎరా ప్లస్ వేరియంట్లో, డిలైట్ ప్లస్ వేరియంట్లో లభించే ఫీచర్లతో పాటుగా, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ ఫీచర్లు అదనంగా లభించనున్నాయి.
హ్యుందాయ్ ఇయాన్ ఎల్‌పిజి మాగ్నా ప్లస్ వేరియంట్లో, ఎరా ప్లస్ వేరియంట్లో లభించే ఫీచర్లతో పాటుగా, యూఎస్‌బి, ఆక్స్-ఇన్ కనెక్టివిటీతో కూడిన 2-డిన్ ఆడియో సిస్టమ్ అదనంగా లభించనుంది.
హ్యుందాయ్ ఇయాన్ ఎల్‌పిజి వేరియంట్లలో 34 లీటర్ల సామర్థ్యం ఉన్న ఎల్‌పిజి ట్యాంక్, 32 లీటర్ల సామర్థ్యం ఉన్న పెట్రోల్ ట్యాంక్‌లు ఉంటాయి. ఫుల్ ట్యాంక్ ఎల్‌పిజి సిలిండర్‌తో 1,200 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు.


Click it and Unblock the Notifications








