సరికొత్త ఫ్లూయిడిక్ ఎలంట్రాను విడుదల చేసిన హ్యుందాయ్
దేశపు ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ సరికొత్త ఫ్లూయిడిక్ ఎలాంట్రా సెడాన్‌ను నేడు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో సరికొత్త హ్యుందాయ్ ఎలాంట్రా ప్రీమియం సెడాన్ లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్ ఎలాంట్రాలో 1.8 లీటర్ డిఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 149.5 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 177 ఎన్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. డీజిల్ వెర్షన్ ఎలాంట్రాలో ఉపయోగించిన 1.6 లీటర్ సిఆర్‌డిఐ ఇంజన్ 128 పిఎస్‌ల శక్తిని, 259 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.
కొత్త హ్యుందాయ్ ఎలాంట్రా ఫ్లూయిడిక్‌లో లభించే వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
హ్యుందాయ్ ఎలాంట్రా పెట్రోల్ వేరియంట్స్:
* హ్యుందాయ్ ఎలాంట్రా ఎస్ - రూ. 12.51 లక్షలు
* హ్యుందాయ్ ఎలాంట్రా ఎస్ఎక్స్ మ్యాన్యువల్ - రూ. 13.74 లక్షలు
* హ్యుందాయ్ ఎలాంట్రా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ - రూ. 14.74 లక్షలు
హ్యుందాయ్ ఎలాంట్రా డీజిల్ వేరియంట్స్:
* హ్యుందాయ్ ఎలాంట్రా ఎస్ - రూ. 12.91 లక్షలు
* హ్యుందాయ్ ఎలాంట్రా ఎస్ఎక్స్ మ్యాన్యువల్ - రూ. 14.85 లక్షలు
* హ్యుందాయ్ ఎలాంట్రా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ - రూ. 15.85 లక్షలు
హ్యుందాయ్ నుంచి అత్యంత పాపులర్ అయిన ఫ్లూయిడిక్ డిజైన్ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని సరికొత్త ఎలాంట్రా ప్రీమియం సెడాన్‌ను కంపెనీ అభివృద్ధి చేసింది. గడచిన జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా కంపెనీ ఈ మోడల్‌ను ప్రదర్శనకు ఉంచింది. ఈ సెగ్మెంట్‌లోని హోండా సివిక్, చెవర్లే క్రూజ్, టొయోటా కరోలా ఆల్టిస్, ఫోక్స్‌వ్యాగన్ జెట్టా, స్కొడా లారా, రెనో ఫ్లూయెన్స్ వంటి మోడళ్లకు కొత్త ఫ్లూయిడిక్ ఎలాంట్రా గట్టి పోటీ ఇవ్వనుంది.
కొత్త హ్యుందాయ్ ఎలాంట్రాలో ఫ్రంట్ సీట్లలో ఎయిర్ వెంటిలేషన్, పూర్తి భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, పుష్ బటన్ స్టార్ట్‌తో కూడిన స్మార్ట్ కీ, సోలార్ గ్లాస్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రెయిన్ సెన్సార్స్, స్పోర్టీ పెడల్స్, పవర్ సైడ్ మిర్రర్స్, సైడ్ మిర్రర్స్‌పై టర్నింగ్ ఇండికేటర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా.. ఎమ్‌పి3, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 2డిన్ ఆడియో సిస్టమ్, స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్, సురక్షితమైన మరియు సులభమైన పార్కింగ్ కోసం ఎలక్ట్రో క్రోమిక్ మిర్రర్ (ఈసిఎమ్)తో కూడిన రియర్ వ్యూ కెమెరా ఆప్షన్‌తో ఇది లభ్యమవుతుంది.


Click it and Unblock the Notifications









