రాష్ట్ర మార్కెట్లో కొత్త ఎలంట్రాను విడుదల చేసిన హ్యుందాయ్

భారతదేశపు ప్రముఖ కార్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా దేశీయ విపణిలో ప్రవేశపెట్టిన సరికొత్త ఫ్లూయిడిక్ ఎలాంట్రా ప్రీమియం సెడాన్‌ ఇప్పుడు రాష్ట్ర మార్కెట్లో కూడా లభ్యం కానుంది. సరికొత్త హ్యుందాయ్ ఎలాంట్రా సెడాన్‌ను కంపెనీ హైదరాబాద్‌లో విడుదల చేసింది. నియో ఫ్లూయడిక్ ఎలాంట్రాగా వచ్చి ఈ కొత్త ప్రీమియం సెడాన్ డీజిల్, పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది.

కంపెనీ ఫ్లాగ్‌షిప్ డిజైన్ కాన్సెప్ట్, విలాసవంతమైన ఇంటీరియర్స్, అధునాతన ఫీచర్లు, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలతో సరికొత్త ఎలాంట్రా తీర్చిదిద్దామని కంపెనీ పేర్కొంది. పెట్రోల్ వెర్షన్ హ్యుందాయ్ ఎలాంట్రాలో 1.8 లీటర్ డిఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 149.5 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 177 ఎన్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. అలాగే, డీజిల్ వెర్షన్ ఎలాంట్రాలో ఉపయోగించిన 1.6 లీటర్ సిఆర్‌డిఐ ఇంజన్ 128 పిఎస్‌ల శక్తిని, 259 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.


హైదరాబాద్ మార్కెట్లో లభించే కొత్త హ్యుందాయ్ ఫ్లూయిడిక్‌ ఎలాంట్రా వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

* Hyundai Neo Fludic Elantra VTVT 1.8 S - INR 1,273,240
* Hyundai Neo Fludic Elantra CRDi 1.6 - INR 1,313,950
* Hyundai Neo Fludic Elantra CRDi 1.6 S - INR 1,388,250
* Hyundai Neo Fludic Elantra VTVT 1.8 SX - INR 1,398,427
* Hyundai Neo Fludic Elantra VTVT 1.8 SX AT - INR 1,500,205
* Hyundai Neo Fludic Elantra CRDi 1.6 SX - INR 1,511,400
* Hyundai Neo Fludic Elantra CRDi 1.6 SX AT - INR 1,613,178

హ్యుందాయ్ నుంచి అత్యంత పాపులర్ అయిన ఫ్లూయిడిక్ డిజైన్ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని సరికొత్త ఎలాంట్రా ప్రీమియం సెడాన్‌ను కంపెనీ అభివృద్ధి చేసింది. గడచిన జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా కంపెనీ ఈ మోడల్‌ను ప్రదర్శనకు ఉంచింది. ఈ సెగ్మెంట్‌లోని హోండా సివిక్, చెవర్లే క్రూజ్, టొయోటా కరోలా ఆల్టిస్, ఫోక్స్‌వ్యాగన్ జెట్టా, స్కొడా లారా, రెనో ఫ్లూయెన్స్ వంటి మోడళ్లకు కొత్త ఫ్లూయిడిక్ ఎలాంట్రా గట్టి పోటీ ఇవ్వనుంది.

హ్యుందాయ్ ఫ్లూయిడిక్ ఎలాంట్రా ఫోటో గ్యాలరీ:

కొత్త హ్యుందాయ్ ఎలాంట్రాలో ఫ్రంట్ సీట్లలో ఎయిర్ వెంటిలేషన్, పూర్తి భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, పుష్ బటన్ స్టార్ట్‌తో కూడిన స్మార్ట్ కీ, సోలార్ గ్లాస్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రెయిన్ సెన్సార్స్, స్పోర్టీ పెడల్స్, పవర్ సైడ్ మిర్రర్స్, సైడ్ మిర్రర్స్‌పై టర్నింగ్ ఇండికేటర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా.. ఎమ్‌పి3, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 2డిన్ ఆడియో సిస్టమ్, స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్, సురక్షితమైన మరియు సులభమైన పార్కింగ్ కోసం ఎలక్ట్రో క్రోమిక్ మిర్రర్‌ (ఈసిఎమ్)తో కూడిన రియర్ వ్యూ కెమెరా ఆప్షన్‌తో ఇది లభ్యమవుతుంది.

More from DriveSpark

Article Published On: Saturday, August 18, 2012, 11:33 [IST]
English summary
Hyundai has launched the new Fluidic Elantra sedan in Hyderabad with a starting price of Rs. 12.73 lakhs. The new Elantra is a completely different package when compared with the previous Elantra that was being sold here. Hyundai opened bookings of the new Elantra fully confident of its performance in the market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+