శాంత్రో, నెక్స్ట్ జెన్ ఐ10 కస్టమర్ల కోసం హ్యుందాయ్ ఆఫర్
దేశపు ద్వితీయ అగ్రగామి కార్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఐఎల్) తమ కస్టమర్ల కోసం పరిమిత కాలపు ఆఫర్‌ను ప్రకటించింది. హ్యుందాయ్ అందిస్తున్న శాంత్రో, నెక్స్ట్ జెన్ ఐ10 కార్లను వినియోగిస్తున్న కస్టమర్ల కోసం "5 స్టార్ అష్షూరెన్స్ ప్రోగ్రామ్" అనే పేరుతో హ్యుందాయ్ ఓ ఆకర్షనీయమైన ఆఫర్‌ను అందిస్తోంది.
5 స్టార్ అష్షూరెన్స్ ప్రోగ్రామ్: ఈ స్కీమ్‌లో భాగంగా, ఈ రెండు కార్లను వినియోగించే కస్టమర్లకు టోటల్ మెయింటినెన్స్ అష్షూరెన్స్, మోటార్ అష్షూరెన్స్, వారంటీ అష్షూరెన్స్, ఎక్సేంజ్ అష్షూరెన్స్, రోడ్‌సైడ్ అష్షూరెన్స్‌లను కంపెనీ అందిస్తుంది.
1. టోటల్ మెయింటినెన్స్ అష్షూరెన్స్:
ఇందులో భాగంగా, 3 ఏళ్లు లేదా 40,000 కి.మీ. (ఏది ముందైతే అది) పాటు ఉచిత మెయింటినెన్స్‌ను శాంత్రో, నెక్స్ట్ జెన్ ఐ10 కస్టమర్లు ఆస్వాదించవచ్చు. వాహన మరమ్మత్తులకు అయ్యే ఖర్చులను ఇది కవర్ చేస్తుంది.
2. మోటార్ అష్షూరెన్స్:
ఇందులో కేవలం ఒక్క రూపాయికే ఏడాది పాటు ఇన్సూరెన్స్ కవరేజ్‌ను పొందవచ్చు.
3. వారంటీ అష్షూరెన్స్:
ఇందులో మూడవ సంవత్సరం పొడగింపు వారంటీని పొందవచ్చు. ఇది కారు కొనుగోలు చేసిన తేది నుండి మూడవ సంవత్సరం వరకూ లేదా 40,000 వారంటీని కవర్ చేస్తుంది.
4. ఎక్సేంజ్ అష్షూరెన్స్:
ఇందులో భాగంగా, రూ.15,000 ఎక్సేంజ్/లాయల్టీ బోనస్‌లను కస్టమర్లు ఎంజాయ్ చేయవచ్చు.
5. రోడ్‌సైడ్ అష్షూరెన్స్:
రెండేళ్ల పాటు 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మద్దతును హ్యుందాయ్ అందిస్తోంది.
ఈ స్కీమ్ కొనుగోలు చేయడానికి హ్యుంద్యాయ్ శాంత్రో, నెక్స్ట్ జెన్ ఐ10 కస్టమర్లు రూ.14,000 లను చెల్లిస్తే సరిపోతుంది. కారును కొనుగోలు చేసిన తర్వాత వినియోగదారును కంపెనీ వైపు నుండి పూర్తి స్థాయి మద్ధతుని అందిచటం ద్వారా వినియోగదారుని సంతృప్తిని (కస్టమర్ శాటిస్‌ఫాక్షన్)ను పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని హెచ్ఎమ్ఐఎల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ అరవింద్ సక్సేనా తెలిపారు.
వాస్తవానికి గత కొద్ది కాలంగా ఇండియాలో పెట్రోల్ కార్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. అందులో శాంత్రో, నెక్స్ట్ జెన్ ఐ10 మోడళ్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 5 స్టార్ అష్షూరెన్స్ ప్రోగ్రామ్ ద్వారా ఈ రెండు మోడళ్ల అమ్మకాలును పెంచుకోవాలని హ్యుందాయ్ మోటార్ ఇండియా భావిస్తోంది.


Click it and Unblock the Notifications









