హ్యుందాయ్ శాంత్రో, ఇయాన్, నెక్స్ట్ జెన్ ఐ10 కార్లపై డిస్కౌంట్స్

దేశవ్యాప్తంగా నేడు టీచర్స్ డే వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. మనకు విద్య నేర్పి విద్యావంతులుగా తీర్చిదిద్దే గురువులను గుర్తు చేసుంటూ ఈ వేడుకలను జరుపుకోవటం జరుగుతుంది. సరే.. ఇదంతా అటుంచితే, టీచర్స్ డే వేడుకలను పురస్కరించుకొని దేశపు ద్వితీయ అగ్రగామి కార్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా కస్టమర్ల కోసం స్పెషల్ ఆఫర్లను అందిస్తోంది.

ఈ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా, హ్యుందాయ్ అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ పెట్రోల్ కార్లు శాంత్రో జింగ్, ఇయాన్, నెక్స్ట్ జెన్ ఐ10 కార్లపై కంపెనీ భారీ ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇప్పుడు హ్యుందాయ్ కస్టమర్లు శాంత్రో జింగ్ కోనుగోలుపై రూ.45,050, ఇయాన్ కోనుగోలుపై రూ.27,250 మరియు నెక్స్ట్ జెన్ ఐ10 కోనుగోలుపై రూ.53,257 లను ఆదా చేసుకోవచ్చు.

అంతేకాకుండా, హ్యుందాయ్ తమ వాహనాల కొనుగోలుకు భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ద్వారా రుణ సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది. 7 ఏళ్ల కాల వ్యవధికి గాను ప్రతి లక్ష రూపాయల రుణంపై రూ.1699 ఈఎమ్‌ఐ సౌకర్యాన్ని బ్యాంక్ ఆఫర్ చేస్తోంది.

ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం, పెట్రోల్ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వీటి అమ్మకాలను పెంచుకునేందుకు హ్యుందాయ్ ఈ స్పెషల్ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం పెట్రోల్ కార్లపై మాత్రమే ఈ ఆఫర్లు లభించనున్నాయి. ఏదేమైనప్పటికీ, సరసమైన ధరకే పెట్రోల్ కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి మాత్రం ఇదొక చక్కటి ఆప్షన్‌గా చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, September 5, 2012, 13:16 [IST]
English summary
On this Teachers Day as a token of gratitude, Hyundai India comes with an exciting offer for its customers. Now Hyundai buyers will get massive savings on petrol cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+