దీపావళికి సందడి చేయనున్న హ్యుందాయ్ ఎలాంట్రా

గతంలో ఆటో ప్రియులను అలరించి, మురిపించి అనతరం కనుమరుగైన హ్యుందాయ్ ప్రీమియం సెడాన్ 'ఎలంట్రా' త్వరలోనే ఓ సరికొత్త లుక్ అండ్ ఫీల్‌తో భారత రోడ్లపైకి రానుంది. కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా 2004 తొలిసారి ఎలంట్రా సెడాన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. అయితే, ఈ మోడల్‌ అమ్మకాలు ఆశించిన రీతిలో సాగకపోవడంతో కంపెనీ దీని అమ్మకాలను 2007లో నిలిపివేసింది.

కాగా.. ఇప్పుడు ప్రీమియం సెడాన్ సెగ్మెంట్ పుంజుకోవటంతో సరికొత్త అప్‌గ్రేడెడ్ ఫేస్‌లిఫ్ట్ హ్యుందాయ్ ఎలాంట్రా సెడాన్‌ను ఇండియన్ మార్కెట్లో రీలాంచ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. హ్యుందాయ్ నుండి అత్యంత పాపులర్ అయిన ఫ్లూయిడిక్ డిజైన్ కాన్సెప్ట్ ఆధారంగా డిజైన్ చేసిన ఓ సరికొత్త హ్యుందాయ్ ఎలంట్రాను కంపెనీ ఇప్పటికే ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ కూడా నిర్వహిస్తోంది. ఈ సెగ్మెంట్లో టొయోటా అందిస్తున్న కరోలా సెడాన్‌ను సవాల్ చేస్తూ హ్యుందాయ్ ఎలంట్రా మార్కెట్లోకి రానుంది.


పాత హ్యుందాయ్ ఎలాంట్రా సెడాన్‌తో పోల్చుకుంటే కొత్త హ్యుందాయ్ ఎలంట్రా ఇంటీరియర్స్, ఎక్స్‌టీరియర్స్‌లలో అనేక మార్పులు ఉండనున్నాయి. కొత్త హ్యుందాయ్ ఎలాంట్రా సెడాన్‌లో 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అలాగే, కొత్త 1.8 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. డి-సెగ్మెంట్ సెడాన్ మార్కెట్లోని స్కొడా లారా, ఫోక్స్‌వ్యాగన్ జెట్టా, రీనాల్ట్ ఫ్లూయెన్స్, చెవర్లే క్రూజ్ వంటి, టొయోటా కరోలా ఆల్టిస్ వంటి మోడళ్లతో కొత్త హ్యుందాయ్ ఎలాంట్రా పోటీ పడనుంది.

గతంలో హ్యుందాయ్ ఇండియాలో ప్రవేశపెట్టిన పాత ఎలంట్రా సెడాన్ ఆకర్షనీయమైన డిజైన్ లేని కారణంగా దేశీయ విపణిలో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అమెరికాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో హ్యుందాయ్ ఎలంట్రా సెడాన్‌కు అగ్రస్థానం ఉంది. మరి కొత్త హ్యుందాయ్ ఎలాంట్రాన్ ఇండియన్ మార్కెట్లో హిట్ అవుతుందో ఫట్ అవుతుందో తెలియాలంటే వచ్చే దీపావళి ఆగాల్సిందే మరి. రానున్న సెప్టెంబర్ నాటికి కొత్త హ్యుందాయ్ ఎలాంట్రా సెడాన్ ఇండియన్ రోడ్లపై సందడి చేయనుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 12, 2012, 18:26 [IST]
English summary
India's second largest car maker Hyundai Motor India is planning to launch its premium sedan Elantra in Indian market by Diwali.Company has unveiled this new Fludic Elantra sedan at 2012 Delhi Auto Expo.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+