భవిష్యత్తులో ఐస్ క్రీమ్‌, సోప్‌, షాంపులతో నడవనున్న కార్లు!

By Ravi

సాధారణంగా కార్లు పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో నడుస్తాయని మనకి తెలుసు. ఇవే కాకుండా, బ్యాటరీ పవర్, ఇథనాల్, బయో ఫ్యూయెల్‌ వంటి కృత్రిమ వనరులతో నడిచే కార్లు కూడా ఉన్నాయి. మరోవైపు నీరు, గాలి వంటి ప్రకృతి ప్రసాధిత వనరులతో నడిచే కార్లపై పరిశోధనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, రానున్న రోజుల్లో ఐస్ క్రీమ్‌లు, సబ్బులు, షాంపులతో నడిచే కార్లను కూడా మన చూసే ఆస్కారం ఉంది. ఏంటి, తినే ఐస్ క్రీమ్‌లు వంటికి రుద్దుకునే సబ్బులతో కార్లు నడుస్తాయా..? మా చెవుల్లో ఏమైనా పూలు కనబడుతున్నాయా..? అంటారా..! అయితే, ఈ కథనం చదవండి.

లండన్‌కు చెందిన మాంచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల ప్రకారం, ఐస్ క్రీమ్‌లు, సబ్బులు, షాంపులలో ఉండే హైడ్రోకార్బన్ రసాయనాలను కార్లలో ఇంధనంగా ఉపయోగించుకోవచ్చని తేలింది. ఈ పరిశోధకుల బృందానికి నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్ నిక్ టర్నర్ సింథటిక్ బయాలజీని ఉపయోగించి సాధారణంగా ఉండే ఫ్యాటీ యాసిడ్లను హైజాక్ చేసి, సదరు ఫ్యాటీ మోలిక్యూల్స్‌ను ఉపయోగించి రెడీ-టూ-యూజ్ ఫ్యూయెల్, హౌస్‌హోల్డ్ కెమికల్స్‌‌ను తయారు చేయవచ్చని పేర్కొన్నారు.

Car

మన దైనందిన జీవితంలో హైడ్రోకార్బన్ కెమికల్స్ ప్రతిచోటా ఉంటాయి. సబ్బులలో సువాసన కోసం ఉపయోగించే రసాయనాలు, షాంపులలో చిక్కదనం కోసం ఉపయోగించే రసాయనాల్లో హైడ్రోకార్బన్ కెమికల్స్ ఉంటాయి. టాక్సిక్‌ను ఇన్‌ఫ్లూయెన్స్ చేయటంలో కార్బన్‌ల సంఖ్య అవి యాసిడ్, ఆల్డేహైడ్, ఆల్కహాల్ లేదా ఆల్కేన్ ఏదైనా సరే చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ బయోలాజికల్ ఆర్గానిజమ్స్. ప్రస్తుతానికి ఇది పరిశోధన దశలోనే ఉంది. ఇందుకు సంబంధించిన తుది పరిశోధన నివేదిక త్వరలోనే వెల్లడి కానుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 19, 2012, 15:08 [IST]
English summary
Researchers at the University of Manchester have identified that hydrocarbon chemicals found in ice-creams, soaps and shampoos could be used as a ready-to-use fuels in cars. Researchers, led by Professor Nick Turner used synthetic biology to hijack the naturally-existing fatty acids and direct those fatty molecules towards the production of ready-to-use fuel and household chemicals.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+