టెస్టింగ్ దశలో హోండా బ్రయో సెడాన్: ఫోటోలు

By Ravi

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ భారత అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ హోండా బ్రయో త్వరలోనే సెడాన్ వెర్షన్‌లో లభ్యం కానున్న తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇటీవలి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. బ్రయో సెడాన్ విడుదలను ఖరారు చేస్తూ హోండా తమ థాయ్‌లాండ్ వెబ్‌సైట్‌లో ఓ టీజర్‌ను కూడా ప్రారంభించింది. అంతేకాకుండా.. సెడాన్ వెర్షన్ బ్రయోను హోండా థాయ్‌లాండ్ రోడ్లపై టెస్టింగ్ కూడా నిర్వహిస్తోంది. ఇదిగో.. ఈ ఫోటో ఫీచర్‌లో హోండా బ్రయో సెడాన్‌ను టెస్టింగ్ చేస్తుండగా తీసిన ఫోటోలను గమనించవచ్చు.

సి సెగ్మెంట్లో కంపెనీ అందిస్తున్న హోండా సిటీ సెడాన్ కన్నా తక్కువ ధరలో ఓ సెడాన్‌ను కోరుకునే వారి కోసం హోండా మోటార్స్ ఈ కారును అభివృద్ధి చేస్తోంది. బ్రయో హ్యాచ్‌బ్యాక్ ఫ్లాట్‌ఫామ్‌పై హోండా ఈ ఎంట్రీ లెవల్ సెడాన్‌ను అభివృద్ధి చేసింది. హోండా బ్రయో సెడాన్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభ్యం కావచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి. డీజిల్ కార్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చే భారత్ వంటి మార్కెట్లను టార్గెట్ చేసుకొని హోండా ఈ కారును తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

హోండా బ్రయో సెడాన్

హోండా బ్రయో సెడాన్ టెస్టింగ్ - ఫ్రంట్ వ్యూ

హోండా బ్రయో సెడాన్

హోండా బ్రయో సెడాన్ టెస్టింగ్ - రియర్ వ్యూ

హోండా బ్రయో సెడాన్

హోండా బ్రయో సెడాన్ టెస్టింగ్

హోండా బ్రయో సెడాన్

హోండా బ్రయో సెడాన్ టెస్టింగ్

హోండా బ్రయో సెడాన్

హోండా బ్రయో సెడాన్ టెస్టింగ్

హోండా బ్రయో సెడాన్

హోండా బ్రయో సెడాన్ టెస్టింగ్

హోండా బ్రయో సెడాన్

హోండా బ్రయో సెడాన్ టీజర్


మొదట లాంచ్ థాయ్‌లాండ్ లోనే..
గతంలో హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్ వెర్షన్ కూడా తొలుతగా థాయ్‌లాండ్ మార్కెట్లోనే విడుదలైన సంగతి తెలిసిందే. అదేవిధంగా, హోండా బ్రయో సెడాన్ వెర్షన్ కూడా తొలుతగా థాయ్‌లాండ్ మార్కెట్లో అనంతరం ఆసియా మార్కెట్లలో లభ్యం కానుంది. దీన్ని బట్టి చూస్తుంటే, బ్రయో సెడాన్ థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదలైన కొద్ది నెలల్లోనే భారత మార్కెట్లో కూడా అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంది. ఇండియాలో హోండాకు ఇప్పటి వరకూ డీజిల్ కార్ పోర్ట్‌ఫోలియో లేదు. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, భారత మార్కెట్లో లభ్యం కానున్న మొట్టమొదటి డీజిల్ హోండా కారు బ్రయో కానుంది.

ప్రస్తుతం దేశీయ విపణిలో లభిస్తున్న హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించిన 4-సిలిండర్, 1.2 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌నే పెట్రోల్ వెర్షన్ బ్రయో సెడాన్‌లోను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 88 పిఎస్‌ల శక్తిని, 109 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

డీజిల్ వెర్షన్ బ్రయో సెడాన్ విషయానికి వస్తే.. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఈ ఇంజన్ సాంకేతిక వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ఇదే ఇంజన్‌ను బ్రయో హ్యాచ్‌బ్యాక్ వెర్షన్‍‌లో కూడా ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఎక్సైజ్ రాయితీని పొందేందుకు గాను హోండా బ్రయో సెడాన్‌ను 4 మీటర్ల పొడవు కన్నా తక్కువగా ఉండేలా కంపెనీ డిజైన్ చేయనుంది. హోండా బ్రయో సెడాన్ ఈ సెగ్మెంట్లోని టాటా ఇండిగో ఈసిఎస్, కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, త్వరలో మార్కెట్లోకి రానున్న సబ్ ఫోర్-మీటర్ మహీంద్రా వెరిటో వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది.

More from DriveSpark

Article Published On: Monday, November 5, 2012, 12:10 [IST]
English summary
Japanese carmaker Honda is developing a Brio-based sedan, which is expected to hit Indian roads by mid-next year. Company has already released an official teaser image of the upcoming Brio sedan and now they are testing it on Thailand roads. Have a look at the Spy Shots of Honda Brio sedan here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+