టాటా సఫారీని రేంజ్ రోవర్‌లా మార్చిన కార్ మోడిఫైయర్
ఈ ఫోటోలో కనిపిస్తున్న కారును చూసి ఇదే ఫారిన్ కారో లేక ఖరీదైన లగ్జరీ కారును అనుకొంటే మీరు కారులో కాలేసినట్లే. ఎందుకంటే, ఇది టాటా సఫారీ ఎస్‌యూవీ కాబట్టి. చూడటానికి అలా లేక పోయినా ఇది నిజంగానే టాటా మోటార్స్ అందిస్తున్న పవర్‌ఫుల్ ఎస్‌యూవీ టాటా సఫారీ. ఢిల్లీకి చెందిన కార్ మోడిఫైయర్ కంపెనీ 'బిగ్ డాడీ కస్టమ్స్' టాటా సఫారీని ఇలా మార్చి వేసింది.
చూడటానికి ఇది అచ్చం రేంజ్ రోవర్ ఎవోక్ మాదిరిగానే అనిపించే ఈ టాటా సఫారీ ఎస్‌యూవీకి బిగ్ డాడీ కస్టమర్స్ 'మూన్ రోవర్' అనే పేరును పెట్టిందిం. ప్రస్తుతం భారత మార్కెట్లో రేంజ్ రోవర్ ఎవోక్ లగ్జరీ ఎస్‌యూవీని టాటా మోటార్స్ సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది. భారత్‌లో దీని ధర రూ.52 లక్షల నుంచి రూ.67 లక్షల రేంజ్‌లో ఉంది.
అయితే రేంజ్ రోవర్ ఎవోక్‌లా కనిపించే ఈ డూప్లికేట్ మూన్ రోవర్ కారును తయారు చేయడానికి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల ఖర్చు అవుతుందని బిగ్ డాడీ కస్టమ్స్ పేర్కొంది. టాటా సఫారీని ఇలా రూపు రేఖలు మార్చడానికి కనీస 3 నుంచి 4 నెలల సమయం పడుతుందని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.
కాబట్టి మీరు కూడా రేంజ్ రోవర్ ఎవోక్‌లా కనిపించే ఇలాంటి టాటా సఫారీని డ్రైవ్ చేయాలనుకుంటే పాత లేదా కొత్త సఫారీ కారును కొనుగోలు చేసి ఢిల్లీలోని బిగ్ డాడీ కస్టమ్స్‌కు ఆ కారును పంపించి డబ్బు చెల్లిస్తే. కొద్దిరోజుల్లో మీ సఫారీ కాస్తా మూన్ రోవర్‌గా మారిపోతుంది.
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో టాటా సఫారీ రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షల రేంజ్‌లో లభిస్తోంది. దీనిని మూన్ రోవర్‌గా మార్చుకోవాలంటే మరో మూడు లక్షలు అధనంగా ఖర్చు అవుతుంది. అంటే కేవలం రూ.13 లక్షల నుంచి రూ.18 లక్షల రేంజ్‌లోనే రేంజ్ రోవర్ ఎవోక్ లాంటి మూన్ రోవర్ కారును సొంతం చేసుకోవచ్చన్నమాట. అయితే, ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి కాబట్టి, బ్రిటీష్ లగ్జరీ కారు రేంజ్ రోవర్ ఎవోక్‌లో ఉండే ఫీచర్లు, సౌకర్యాలు మోడిఫై చేసిన టాటా సఫారీలో మాత్రం ఉండవు.


Click it and Unblock the Notifications









