కలగానే మిగిలిపోనున్న జాగ్వార్ సి-ఎక్స్75 సూపర్ కారు
బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ తమ సూపర్ కార్ ప్లాన్‌కు గుడ్‌బై చెప్పింది. జాగ్వార్ మార్కెట్లో విడుదల చేయాలనున్న 'సి-ఎక్స్75' సూపర్ కారును ఉత్పత్తి స్థాయికి తీసుకువెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక మాంద్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జాగ్వార్ సి-ఎక్స్75 హైబ్రిడ్ సూపర్ కారును ఉత్పత్తి చేయబోవటం లేదని జాగ్వార్ గ్లోబల్ బ్రాండ్ డైరెక్టర్ అడ్రియన్ హాల్‌మార్క్ వెల్లడించారు. వచ్చే మే నెల వరకూ, ఇలాంటివి కేవలం ఐదు ప్రోటోటైప్ కార్లను అభివృద్ధి చేయనున్నారు. అందులో మూడు కార్ల వరకూ వేలంలో విక్రయిస్తారు. మిగిలిన వాటిలో ఒకటి ఫ్యూచర్ జాగ్వార్ మ్యాజియంకు తరలించబడుతుంది, మరొకటి జాగ్వార్ రన్నింగ్ డెమోనిస్ట్రేషన్ కోసం ఉంచుతారు.
ఈ కారును తాము ఉత్పత్తి చేయగలమని, అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో 8-10 లక్షల యూరోల ఖరీదు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.8.74 కోట్లు) చేసే ఈ సూపర్ కారును ఉత్పత్తి దశకు తీసుకువెళ్లటం అసాధ్యమని ఆయన తెలిపారు. జాగ్వార్ సి-ఎక్స్75 కారును తొలిసారిగా 2010లో జరిగిన ప్యారిస్ మోటార్ షోలో కంపెనీ ప్రదర్శనకు ఉంచింది. ఇది పెట్రోల్ మరియు బ్యాటరీ పవర్‌తో నడిచే హైబ్రిడ్ సూపర్ కారు. ఇందులో 1.6 లీటర్ సూపర్‌ఛార్జ్‌డ్/టోర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను అలాగే, రెండు ఎలక్ట్రి మోటర్లను (వెనుక భాగంలో) అమర్చారు. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 888 బిహెచ్‌పిల శక్తిని, 590 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది కేవలం 2.8 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని, అలాగే 6 సెకండ్ల లోపే 0-160 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

జాగ్వార్ సి-ఎక్స్75 సూపర్ కారు

జాగ్వార్ సి-ఎక్స్75 సూపర్ కారు

జాగ్వార్ సి-ఎక్స్75 సూపర్ కారు

జాగ్వార్ సి-ఎక్స్75 సూపర్ కారు

జాగ్వార్ సి-ఎక్స్75 సూపర్ కారు

జాగ్వార్ సి-ఎక్స్75 సూపర్ కారు

జాగ్వార్ సి-ఎక్స్75 సూపర్ కారు

జాగ్వార్ సి-ఎక్స్75 సూపర్ కారు

జాగ్వార్ సి-ఎక్స్75 సూపర్ కారు

జాగ్వార్ సి-ఎక్స్75 సూపర్ కారు

జాగ్వార్ సి-ఎక్స్75 సూపర్ కారు

జాగ్వార్ సి-ఎక్స్75 సూపర్ కారు

జాగ్వార్ సి-ఎక్స్75 సూపర్ కారు

జాగ్వార్ సి-ఎక్స్75 సూపర్ కారు

జాగ్వార్ సి-ఎక్స్75 సూపర్ కారు

జాగ్వార్ సి-ఎక్స్75 సూపర్ కారు



Click it and Unblock the Notifications








