జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లను ఇండియాలో ఉత్పత్తి చేయం

By Ravi

Ratan Tata
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ భారత మార్కెట్లో అందిస్తున్న కార్లు ఎప్పటికీ ప్రీమియం కార్లుగానే మిగిలిపోనున్నాయి. సమీప భవిష్యత్తులో ఇండియాలో జాగ్వార్ లాండ్ రోవర్ వాహనాలను ఉత్పత్తి చేసే యోచన లేదని టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా స్పష్టం చేశారు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న అర్థంలేని కొన్ని పన్నుల కారణంగా ఈ వాహనాలను ఇక్కడ అసెంబ్లింగ్ చేయడం వలన దిగుమతి కంటే ఎక్కువ వ్యయం అవుతుందని ఆయన వివరించారు.

అయితే, చైనాలో ఓ జేఎల్ఆర్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ తయారైన జాగ్వార్ లాండ్ రోవర్ వాహనాలను విదేశాలకు ఎగుమతి రతన్ టాటా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. భారత్‌లో ఈ లగ్జరీ వాహనాలను తయారు చేయటానికి అనువైన పరిస్థితులు లేవని, ఒకవేళ ఇక్కడ ప్లాంటును ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే, అందుకు కావల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటికీ అనేక చిక్కులు కల్పిస్తున్నారని ఆయన చెప్పారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో, ప్రస్తుతం భారత్‌లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాహనాలను పూర్తి స్థాయిలో తయారు చేసే యోచన లేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం టాటా మోటార్స్ కొన్ని రకాల జేఎల్ఆర్ వాహనాల విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని, భారత్‌లో అసెంబ్లింగ్ చేస్తోంది. ఇక్కడి ఆర్థిక పరిస్థితులు, అమల్లో ఉన్న పన్నులను పరిగణలోకి తీసుకుంటే, వీటి దిగుమతి కన్నా వ్యయమే ఎక్కవుతుంది. అందుకే టాటా మోటార్స్ జేఎల్ఆర్ వాహనాలను ఇండియాలో ఉత్పత్తి చేయాలనుకోవటం లేదు.

More from DriveSpark

Article Published On: Friday, December 21, 2012, 11:08 [IST]
English summary
Ratan Tata, the outgoing chairman of the Tata Group has stated that Tata Motor's prime international brands - Jaguar and Land Rover will not have full fledged manufacturing facilities in India. Mr Tata blamed some 'silly' taxes and low volumes for his decision.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+