భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమైన జీప్, క్రైస్లర్

అమెరికాకు చెందిన ప్రముఖ ఎస్‌యూవీల తయారీ కంపెనీ 'జీప్' (Jeep) మరియు దాని మాతృ సంస్థ క్రైస్లర్ (Chrysler)లు భారత మార్కెట్లో ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ విషయానికి సంబంధించి కంపెనీ త్వరలోనే ఓ ప్రకటనను వెల్లడించే ఆస్కారం ఉంది. ప్రస్తుతం భారత మార్కెట్లో యుటిలిటీ వాహనాలకు డిమాండ్ పుంజుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫియట్ (క్రైస్లర్‌ను స్వాధీనం చేసుకున్న ఇటాలియన్ కార్ కంపెనీ) కూడా ఎస్‌యూవీ మార్కెట్లో తమ సత్తా ఏంటో చూపించేందుకు జీప్ బ్రాండ్‌ను భారతీయులకు పరిచయం చేయనుంది.

భారత ఆటోమొబైల్ మార్కెట్లోని ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇప్పటికే అమెరికన్ కార్ కంపెనీలు జనరల్ మోటార్స్, ఫోర్డ్ మోటార్స్‌లు తమ ఉత్పత్తులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సెగ్మెంట్లోకి తాజాగా ఎంట్రీ ఇవ్వనున్న ఫియట్ జీప్ బ్రాంజ్ నుంచి అత్యంత పాపులర్ అయిన 'గ్రాండ్ చిరోకీ' మోడల్‌ను తొలుత దేశీయ విపణిలోకి విడుదల చేసే అవకాశం ఉంది. గ్రాండ్ చిరోకీ తర్వాత కమాండర్, కంపాస్, పాట్రియోట్ మోడళ్లను కూడా ఫియట్ ఇండియాకు తీసుకురానుంది. భారత మార్కెట్లో జీప్ స్థిరత్వాన్ని ఏర్పరుచుకున్న అనంతరం క్రైస్లర్, డాడ్జ్ మోడళ్లను కూడా ఫియట్ ఇండియాలో ఇండియాలో విడుదల చేయాలని భావిస్తోంది.

ఇక గ్రాండ్ చిరోకీ ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఈ మోడల్‌ను తొలిసారిగా 1992లో ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న చిరోకీ నాల్గవ తరానికి (ఫోర్త్ జనరేషన్) చెందినది. ఆఫ్-రోడ్ అడ్వెంచర్లు చేయడానికి గ్రాండ్ చిరోకీ పెట్టింది పేరు. విలాసవంతమైన ఫీచర్లతో లభ్యం కానున్న ఈ మోడల్ అత్యంత సురక్షితమైనది. దీని భద్రతా ఫీచర్లతో ఇది సుమారు 30 వరకూ అవార్డులను సొంతం చేసుకుంది. గంభీరంగా కనిపించే ఈ జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్‌యూవీలో శక్తివంతమైన 3-లీటర్, వీ6 సిఆర్‌డి డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. గంటకు గరిష్టంగా 203 కి.మీ. వేగంతో పరుగులు పెట్టే ఈ కారు కేవలం 8.2 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

ఇందులో 'సెలెక్-టెర్రైన్' అనే ఆఫ్-రోడ్ ఫీచర్ ఉంటుంది. ఇది ఇసుక/బురద, మంచు, రాళ్లు, స్పోర్ట్, ఆటో అనే ఐదు డ్రైవింగ్ మోడ్‌లను సపోర్ట్ చేస్తుంది. ఏ రోడ్లకు సంబంధిత డ్రైవింగ్ మోడ్‌ను సెలక్ట్ చేసుకొని సౌకర్యవతంగా డ్రైవ్ చేయవచ్చు. ఇందులో ఎనిమిది ఎయిర్‌బ్యాగ్స్, అన్ని (నాలుగు) చక్రాలకు డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సి), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎన్‌హాన్స్‌డ్ యాక్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. భారత మార్కెట్లో జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్‌యూవీ ధర రూ.40 లక్షల వరకూ ఉండొచ్చని అంచనా.

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ వ్రాంగ్లర్

జీప్ వ్రాంగ్లర్

జీప్ వ్రాంగ్లర్

జీప్ వ్రాంగ్లర్

జీప్ వ్రాంగ్లర్

జీప్ వ్రాంగ్లర్

జీప్ వ్రాంగ్లర్

జీప్ వ్రాంగ్లర్

జీప్ వ్రాంగ్లర్

జీప్ వ్రాంగ్లర్

జీప్ వ్రాంగ్లర్

జీప్ వ్రాంగ్లర్

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

More from DriveSpark

Article Published On: Thursday, December 6, 2012, 13:24 [IST]
English summary
American SUV maker Jeep and its parent company Chrysler are all set to enter the Indian market in coming months. Fiat will brings Jeep's popular Grand Cherokee SUV to India as their first product.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+