మరదలికి ఆడి క్యూ3 కారుని కానుకగా ఇచ్చిన జాన్ అబ్రహామ్

బాలీవుడ్ కండల వీరుడు జాన్ అబ్రహామ్ తన మరదలు పుట్టిన రోజున, ఆమె కోసం ఓ ఖరీదైన కానుకను ఇచ్చాడు. జాన్ తన తమ్ముడి భార్య అయిన అంకా అబ్రహామ్‌కు ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని ఆడి క్యూ3 ఎస్‌యూవీని బహుమతిగా ఇచ్చాడు. జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన ఈ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రస్తుతం దేశీయ విపణిలో హాట్ కేకుల్లా అమ్మడవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన మరదలి కోసం ఇటీవలే ఆడి క్యూ3 ఎస్‌యూవీని బుక్ చేసిన జాన్ అబ్రహామ్, ఆ సంస్థ ఇండియన్ ఛీఫ్ మైఖేల్ ప్రెస్కీ చేతుల మీదుగా ఈ కారును ఆమెకు బహుకరింపజేశారు.

జాన్ అబ్రహామ్ గత కొద్ది కాలంగా ఆడి కుటుంబంలో భాగంగా ఉన్నారని, ఇప్పుడు ఇందులోకి తన మరదలు ఆంకా అబ్రహామ్‌ను కూడా ఆయన ఆహ్వానించారని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ తెలిపారు. నేటి యువతరం, మహిళలు ఎక్కువగా ఆడి క్యూ3ని ఆశ్రయిస్తున్నారని, ఆడి క్యూ3చో ఆంకా అబ్రహామ్ అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని పొందగలదని ఆయన అన్నారు.

మరదలికి జాన్ అబ్రహామ్ ఆడి క్యూ3 కానుక

మరదలికి జాన్ అబ్రహామ్ ఆడి క్యూ3 కానుక

బాలీవుడ్ కండల వీరుడు జాన్ అబ్రహామ్ తన మరదలు పుట్టిన రోజున, ఆమె కోసం ఓ ఖరీదైన కానుకను ఇచ్చాడు. జాన్ తన తమ్ముడి భార్య అయిన అంకా అబ్రహామ్‌కు ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని ఆడి క్యూ3 ఎస్‌యూవీని బహుమతిగా ఇచ్చాడు.

ఆడి క్యూ3 కాంపాక్ట్ లగ్జరీ ఎస్‌యూవీ హైలైట్స్:

ఆడి క్యూ3 కాంపాక్ట్ లగ్జరీ ఎస్‌యూవీ హైలైట్స్:

* 2.0 లీటర్ టిడిఐ క్వెట్టారో ఇంజన్ - 130 కి.వా. (177 హెచ్‌పి) శక్తి

* ప్రారంభ ధర కేవలం రూ.26,21,000 (ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర) మాత్రమే.

* ఆడి క్యూ3 ఈ సెగ్మెంట్లో క్వెట్టారో డ్రైవ్‌ట్రైన్‌తో కూడిన మొదటి ఎస్‌యూవీ

ఆడి క్యూ3 ఎక్స్‌టీరియర్స్:

ఆడి క్యూ3 ఎక్స్‌టీరియర్స్:

- 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, 7-ఆర్మ్ డిజైన్, సైజ్ 6.5జే x 16

- రూఫ్ రెయిల్స్

- హీట్-ఇన్సులేటింగ్ గ్లాస్

- ట్రిమ్ స్ట్రైప్స్, బ్లాక్

- పూర్తి ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్ (హీటింగ్ సౌకర్యంతో పాటు)

- ప్రత్యేకమైన డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన హ్యాలోజెన్ హెడ్‌‌లైట్స్

- హెడ్‌లైడ్ రేంజ్ (దూరం) అడ్జస్ట్‌‌మెంట్

ఆడి క్యూ3 ఎక్స్‌టీరియర్స్:

ఆడి క్యూ3 ఎక్స్‌టీరియర్స్:

- ఎల్-గ్రెయిమ్/లెథరెట్టే బి-గ్రెయిమ్ సీటింగ్

- ఇంటీరియర్ లైటింగ్ ప్యాకేజ్

- ముందు, వెనుక సీట్లలో ఫ్లోర్ మ్యాట్స్

- 4-స్పోక్ డిజైన్ కలిగిన లెథర్-కవర్డ్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్

- మోనోమెటాలిక్ లేదా టఫ్ఫల్ బీజ్ (ఇంటీరియర్ కలర్‌ను బట్టి)లో ఇన్‌లేస్

- హెడ్‌లైనింగ్ ఇన్ క్లాత్‌

- లగేజ్ కంపార్ట్‌మెంట్ మ్యాట్

- ప్లాస్టిక్ డోర్ సిల్ ట్రిమ్స్

ఆడి క్యూ3 సేఫ్టీ ఫీచర్లు:

ఆడి క్యూ3 సేఫ్టీ ఫీచర్లు:

- ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి)

- స్థలాన్ని ఆదా చేసే అధనపు చక్రం (స్పేస్-సేవింగ్ స్పేర్ వీల్)

- ఫస్ట్ ఎయిడ్ కిట్ మరియు వార్నింగ్ ట్రయాంగిల్

- కార్ జాక్

- ఫుల్ సైజ్ ఎయిర్‌బ్యాగ్

- హెడ్ ఎయిర్‌బ్యాగ్‌తో పాటుగా ముందు వైపు, వెనుక వైపు సైడ్ ఎయిర్‌బ్యాగ్స్

- ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజేషన్ డివైజ్

- ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్

ఆడి క్యూ3 బేస్ వేరియంట్ - కంఫర్ట్ ఫీచర్లు:

ఆడి క్యూ3 బేస్ వేరియంట్ - కంఫర్ట్ ఫీచర్లు:

* మ్యాన్యువల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్

* హిల్ స్టార్ట్ అసిస్ట్

* ఎలక్ట్రోమెకానికల్ పార్కింగ్ బ్రేక్

* రివర్సబల్ లోడ్ ఫ్లోర్

* ముందు వైపు 4-వే లూంబర్ సపోర్ట్‌తో కూడిన స్టాండర్డ్ ఫ్రంట్ సీట్

* కుడివైపు సీట్ కోసం ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎడమవైపు సీట్ కోసం మ్యాన్యువల్ హైట్ అడ్జస్ట్

* మడుచుకునేందుకు వీలైన వెనుక (రియర్) సీట్

* రేడియో రిమోట్ కంట్రోల్

* ఫ్రంట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్

* రియర్ పార్కింగ్ ఎయిడ్

* క్రూయిజ్ కంట్రోల్

ఆడి క్యూ3 బేస్ వేరియంట్ - ఇన్ఫోటైన్‌మెంట్ ఫీచర్లు:

ఆడి క్యూ3 బేస్ వేరియంట్ - ఇన్ఫోటైన్‌మెంట్ ఫీచర్లు:

* కాన్సెర్ట్ రేడియో

* ప్యాసివ్ స్పీకర్స్

* డ్రైవర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్

* ఆడి మ్యూజిక్ ఇంటర్‌ఫేస్

* వాయిస్ డైలాగ్ సిస్టమ్

* బ్లూటూత్ ఇంటర్‌ఫేస్


ఈ సందర్భంగా జాన్ అబ్రహామ్ మాట్లాడుతూ.. గడచిన కొద్ది సంవత్సరాలుగా తాను ఆడితో ముడిపడి ఉన్నానని, తాను ఉపయోగిస్తున్న పవర్‌ఫుల్, స్పోర్టీ ఎస్‌యూవీ ఆడి క్యూ7తో మంచి డ్రైవింగ్ అనుభూతిని పొందానని, ఇప్పుడు తన మరదలు ఆంకా అబ్రహామ్ కూడా ఇదే తరాహా డ్రైవింగ్ అనుభూతిని పొందాలనే ఉద్దేశ్యంతో ఆమెకు తన జన్మదినం రోజున ఈ ఆడి క్యూ3ని కానుకగా ఇస్తున్నానని చెప్పారు.

గడచిన జూన్ నెలలో భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఆడి క్యూ3, విపణిలోకి విడుదలైన ఐదు రోజుల్లోనే 500 బుకింగ్‌లను సొంతం చేసుకుంది. ఈ ఎస్‌యూవీ కోసం తొలి విడతలో భాగంగా 500 యూనిట్లకు మాత్రమే కంపెనీ బుకింగ్‌లను స్వీకరించింది. అయితే, ఈ మోడల్‌కు లభిస్తున్న విశేష స్పందను దృష్టిలో ఉంచుకొని రెండవ విడత బుకింగ్‌లను కూడా కంపెనీ స్వీకరిస్తోంది. కానీ డెలివరీలు మాత్రం అనుకున్న సమయం కన్నా కాస్తంత ఆలస్యం అయ్యే ఆస్కారం ఉంది.

ఆడి క్యూ3 ఎస్‌యూవీలో శక్తివంతమైన, మెరుగైన మైలేజ్‌నిచ్చే 2.0 టిడిఐ క్వాట్రో ఇంజన్‌‌ను అమర్చారు. ఆడి ఇండియాకు దేశవ్యాప్తంగా ఉన్న 19 డీలర్ల ద్వారా ఆడి క్యూ3 లభ్యం కానుంది. ఆడి క్యూ3చో పాటుగా ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి ఏ7 స్పోర్ట్‌బ్యాక్, ఆడి ఏ8ఎల్, ఆడి క్యూ5, ఆడి క్యూ7, ఆడి ఆర్ఎస్5 కూపే, ఆడి టిటి, ఆడి ఆర్8 సూపర్ స్పోర్ట్స్ కార్, ఆడి ఆర్8 స్పైడర్ కార్లను ఆడి ఇండియా దేశీయ విపణిలో అందిస్తుంది. దేశీయ విపణిలో ఆడి క్యూ3 ధరలు రూ.26.21 లక్షల (బేస్ గ్రేడ్) నుంచి రూ.31.49 లక్షల (హై గ్రేడ్) రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలూ ఎక్స్ షోరూమ్, మహారాష్ట్ర).

More from DriveSpark

Article Published On: Wednesday, October 10, 2012, 10:55 [IST]
English summary
John Abraham enrolls his family into the Q life, gifts an Audi Q3 to sister-in-law, Anca Abraham on her birthday. The sporty Audi Q3 Compact Luxury SUV is priced at Rs 26.21 lakhs (ex-showroom Maharashtra). The Q3 which was showcased at the 2012 Delhi Auto Expo has been made available in two trims.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+