కేన్‌కు లాంబోర్గినీ స్పోర్ట్స్ కారు గిఫ్ట్ ఇచ్చిన కిమ్ కర్దాషియన్

కైపెక్కించే కళ్లు, శరీ వంపు సొంపులతో కుర్రకారును ఉర్రూతలూగించే హాలీవుడ్ హీరోయిన్ కిమ్ కర్దాషియాన్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఎప్పుడో ఏదో వింత వ్యాఖ్యల లేక వింత పనులతోనో వివాదాల్లో ఇరుక్కునే ఈ ముద్దుగుమ్మకు తన కొత్త ప్రియుడికి ఓ మర్చిపోలేని కానుకను ఇచ్చింది. కిమ్ కర్దాషియాన్ గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్తతో సరిగ్గా మూడు నెలలు కూడా కాపురం చేయకుండానే విడాకులు తీసుకొని, ప్రముఖ సింగర్ కేన్ వెస్ట్‌తో కొత్తగా ప్రేమ ప్రయాణం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

అయితే, ఈ ప్రేమ ప్రయాణం మాటేమింటో గానీ.. ఆ వంకతో కేన్ వెస్ట్‌ను మాత్రం కానుకల్లో ముంచేస్తోంది. ఈ అందాల సుందరిని తన ప్రియుడిని ప్రసన్నం చేసుకునేందుకు భారీగానే ఖర్చు చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు తీసే మరియు అత్యంత ఖరీదైన లాంబోర్గినీ స్పోర్ట్స్ కారును కిమ్ కర్దాషియన్‌ తన ప్రియుడికి బహుమతిగా ఇచ్చింది. సుమారు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టే లాంబోర్గినీ అవెంటేడర్ కారును కిమ్ తన ప్రియుడి కోసం కొనుగోలు చేసింది.

Lamborghini Aventador

బ్లాక్ మేట్ ఫినిష్‌తో కూడిన ఈ లాబోర్గినీ అవెంటేడర్‌ ఉపయోగించిన శక్తివంతమైన 6.5 లీటర్, వి12 ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 700 హెచ్‌పిల శక్తిని, 690 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేలం 2.9 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని పుంజుకుంటుంది. అధిక వేగంతో ప్రయాణించేందుకు గానూ ఈ కారు బాడీని ముందు, వెనుక వైపు అల్యూమినియం ఫ్రేమ్‌తో కూడిన కార్బన్ ఫైబర్ మోనోకాక్ (సింగిల్) షాషీని ఉపయోగించారు. ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన లాంబోర్గినీ అవెంటేడర్ సెవన్-స్పీడ్ ట్రాన్సిమిషన్ (ఏడు గేర్లు) సిస్టమ్‌తో లభిస్తుంది.

రెండు డోర్లు మాత్రమే కలిగిన లాంబోర్గినీ అవెంటేడర్ ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. ఇది సిజర్ డోర్స్‌ను (కత్తెర మాదిరిగా పైవైపుకు తెరచుకునే డోర్లు) కలిగి ఉంటుంది. ఇందులో ఏబిఎస్‌, ఈఎస్‌పి, ఎయిర్ బ్యాగ్స్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు కేవలం మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల మైలేజీని మాత్రమే ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, August 17, 2012, 18:50 [IST]
English summary
American celebrity Kim Kardashian has gifted a black Lamborghini Aventador to her boy friend Kayne West. The Aventador is finished in matt black paint and Lamborghini's latest supercar.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+