నలుపు కారును తెలుపు కారుగా మార్చుకున్న కిమ్ కర్దాషియన్
హాలీవుడ్ హాట్ సెలబ్రిటీ కిమ్ కర్దాషియన్ ఐటమ్‌కు రంగు పడింది.. ఈ అమెరికన్ రియాల్టీ టివి స్టార్ ఇటీవలే ఓ నలుపు రంగు మెర్సిడెస్ బెంజ్ మిలటరీ ఎస్‌యూవీని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ముద్దుగుమ్మకు ఏం బుద్ధి పుట్టిందో కానీ.. చక్కగా నలుపు రంగులో ఉన్న కారును పూర్తిగా తెలుపు రంగులోకి మార్చేసుకుంది. కిమ్ కొనుగోలు చేసినప్పుడు ఈ మెర్సిడెస్ బెంజ్ జి63 ఎస్‌యూవీ నలుపు రంగులో ఉండేది. లాస్ ఏంజిల్స్‌కు చెందిన ప్లాటినం మోటార్‌స్పోర్ట్ ఈ కారును తెలుపు రంగులోకి మార్చేసింది.
కిమ్ కర్దాషియన్ కార్ కలెక్షన్ ఎక్కువ భాగం కార్లు నలుపు, తెలుపు రంగుకు చెందినవే ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్‌ను మార్చినట్లుగానే, ఈ ముద్దుగుమ్మ కార్ల రంగును కూడా మార్చేస్తుందని పరిశ్రమ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మరి కిమ్ కర్దాషియన్ బ్లాక్ కలర్ బోర్ కొట్టేసిందో లేక వైట్ కలర్‌పై మోజు పుట్టిందో తెలియదు కానీ, మెర్సిడెస్ బెంజ్ జి63 కారుకు మాత్రం రంగు పడిపోయింది.

అమెరికన్ రియాల్టీ టివి స్టార్ కిమ్ కర్దాషియాన్ ఇటీవలే ఓ నలుపు రంగు మెర్సిడెస్ బెంజ్ జి63 ఎస్‌యూవీని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

కిమ్ కొనుగోలు చేసినప్పుడు నలుపు రంగులో ఉన్న ఈ మెర్సిడెస్ బెంజ్ జి63 ఎస్‌యూవీని ఆమె ఇప్పుడు తెలుపు రంగులోకి మార్చేసుకుంది.

లాస్ ఏంజిల్స్‌కు చెందిన ప్లాటినం మోటార్‌స్పోర్ట్ ఈ మెర్సిడెస్ బెంజ్ జి63 ఎస్‌యూవీని తెలుపు రంగులోకి మార్చేసింది.

కిమ్ కర్దాషియన్ కార్ కలెక్షన్‌లో ఎక్కువ భాగం కార్లు నలుపు, తెలుపు రంగుకు చెందినవే ఉంటాయి.

కిమ్ కర్దాషియన్ కొనుగోలు చేసిన సరికొత్త 2013 వెర్షన్ మెర్సిడెస్ బెంజ్ జి63 ఎస్‌యూవీ ధర రూ.1,50,000 అమెరికన్ డాలర్లు. మన దేశ కరెన్సీలో ఇది సుమారు రూ.75 లక్షలకు పై మాటే.

ఇప్పటి వరకూ 2012 వెర్షన్ మెర్సిడెస్ బెంజ్ జి63 ఎస్‌యూవీ మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంది. కాగా.. 2013 వెర్షన్ మెర్సిడెస్ బెంజ్ జి63 ఎస్‌యూవీ ఇంకా మార్కెట్లోకి విడుదల కావల్సి ఉంది.

మెర్సిడెస్ బెంజ్ జి63 చూడటానికి మన మహీంద్రా బొలెరో మాదిరిగా ఉన్నప్పటికీ, టెక్నాలజీ, డ్రైవింగ్ అండ్ హ్యాండ్లింగ్, ఆఫ్-రోడింగ్ వంటి పలు అంశాల పరంగా గమనిస్తే ఇది ఎన్నోరెట్లు మెరుగ్గా ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ జి63లో పవర్‌ఫుల్ 5.5 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది కేవలం 5.3 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.
మెర్సిడెస్ బెంజ్ జి-క్లాస్ విషయానికి వస్తే.. ఈ జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఒకప్పుడు సైన్యం కోసం రూపొందించిన జి-సిరీస్ ఎస్‌యూవీలో సాధారణ ప్రజల ఉపయోగార్థం ఇందులో కంపెనీ ఓ లైట్ వెయిట్ ప్యాసింజర్ వెర్షన్ జి-సిరీస్‌ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది చూడటానికి మన మహీంద్రా బొలెరో మాదిరిగా ఉన్నప్పటికీ, టెక్నాలజీ, డ్రైవింగ్ అండ్ హ్యాండ్లింగ్, ఆఫ్-రోడింగ్ వంటి పలు అంశాల పరంగా గమనిస్తే ఇది ఎన్నోరెట్లు మెరుగ్గా ఉంటుంది.
కిమ్ కర్దాషియన్ కొనుగోలు చేసిన సరికొత్త 2012 వెర్షన్ మెర్సిడెస్ బెంజ్ జి63 ఎస్‌యూవీ ధర రూ.1,50,000 అమెరికన్ డాలర్లు. మన దేశ కరెన్సీలో ఇది సుమారు రూ.75 లక్షలకు పై మాటే. ఇప్పటి వరకూ 2012 వెర్షన్ మెర్సిడెస్ బెంజ్ జి63 ఎస్‌యూవీ మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంది. కాగా.. 2013 వెర్షన్ మెర్సిడెస్ బెంజ్ జి63 ఎస్‌యూవీ ఇంకా మార్కెట్లోకి విడుదల కావల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2013 వెర్షన్ మెర్సిడెస్ బెంజ్ జి63 ఎస్‌యూవీని సొంతం చేసుకోనున్న తొలి కస్టమర్ కూడా కిమ్ కర్దాషియన్ కావటం విశేషం.
స్వతహాగా మోటార్ వాహనాలంటే మంచి క్రేజ్ ఉన్న కిమ్ ఇటీవలి కాలంలో కొత్త వాహనాలపై సుమారు 1.2 మిలియన్ డాలర్లను ఖర్చు చేసినట్లు సమాచారం. కిమ్ కర్దాషియన్ తాజాగా తన కొత్త ప్రేమికుడు కేన్ వెస్ట్‌కు సుమారు రూ.3 కోట్ల ఖరీదు చేసే లాంబోర్గినీ అవెంటేడర్ కారును కానుకగా ఇచ్చింది. మెర్సిడెస్ బెంజ్ జి63 మిలటరీ వెర్షన్ ఎస్‌యూవీని అనేక దేశాల్లో భద్రతా బలగాలు ఉపయోగిస్తుంటాయి. ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా వంటి దేశాల్లో కంపెనీ ఈ ఎస్‌యూవీని విక్రయిస్తోంది. ఇటీవలే భారతదేశంలో కూడా మెర్సిడెస్ బెంజ్ ఈ ఎస్‌యూవీని విడుదల చేయటం జరిగింది.
గతంలో టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవణ్ కళ్యాన్ కూడా జి-సిరీస్ ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు. కిమ్ కర్దాషియాన్ వద్ద రేంజ్ రోవర్, బెంట్లీ కాంటినెంటల్, ఫెరారీ 458 ఇటాలియా, రోల్స్ రాయిస్ ఫాంటమ్, మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఆర్ వంటి కార్లు ఉన్నాయి. 2013 వెర్షన్ మెర్సిడెస్ బెంజ్ జి63లో పవర్‌ఫుల్ 5.5 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది కేవలం 5.3 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. అడవులు, ఇసుక రోడ్లు, కొండ ప్రాంతాలు వంటి ఆఫ్-రోడ్ ప్రయాణాలకు ఇది అన్ని విధాలుగా అనువుగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








