టాప్‌లెస్ అవెంటేడర్‌ను విడుదల చేసిన లాంబోర్గినీ

ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే కార్లను తయారు చేయటంలో ప్రసిద్ధిగాంచిన ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ లాంబోర్గినీ ఇటీవలే మార్కెట్లో ప్రవేశపెట్టిన తమ సూపర్ కారు అవెంటేడర్‌లో మరికొత్త వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. లాంబోర్గినీ అవెంటేడర్‌లో కూపే వెర్షన్‌ను విజయవంతంగా మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత, కంపెనీ ఇప్పుడు ఇందులో ఓపెన్ టాప్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. 'లాంబోర్గినీ అవెంటేడర్‌ ఎల్‌పి 700-4 రోడ్‌స్టర్' అనే పేరుతో లభ్యం కానున్న ఈ కారు పైభాగాన్ని (రూఫ్)ను అవసరం లేదనుకున్నప్పుడు తొలగించుకొని ఓపెన్ టాప్ కన్వర్టిబల్ కారుగా మార్చుకోవచ్చు.

ఈ స్పోర్ట్స్ కారు రూఫ్ రెండు భాగాలుగా విడిపోతుంది. దీనికి తొలగించి కారు లగేజ్ కంపార్ట్‌మెంట్‌లో దాచుకోవచ్చు. ఈ రూఫ్‌ను కార్బన్ ఫైబర్ పదార్థంతో తయారు చేశారు. లాంబోర్గినీ పేటెంట్ చేసిన ఫోర్జ్‌డ్ కాంపోసిట్, ఆర్‌టిఎమ్ టెక్నాలజీలను ఉపయోగించి అభివృద్ధి చేశారు. ఇందులో ఉపయోగించిన శక్తివంతమైన 6.5 లీటర్, వి12 ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 700 హెచ్‌పిల శక్తిని, 690 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్టం గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.

లాంబోర్గినీ అవెంటేడర్‌ ఎల్‌పి 700-4 రోడ్‌స్టర్

ఓపెన్ టాప్ వెర్షన్ లాంబోర్గినీ అవెంటేడర్‌ ఎల్‌పి 700-4 రోడ్‌స్టర్ కేవలం మూడు సెకండ్లలోనే మూడంకెల వేగాన్ని (2.9 సెకండ్లలోనే 0-100 కి.మీ.) అందుకుంటుంది. అధిక వేగంతో ప్రయాణించేందుకు గానూ ఈ కారు బాడీని ముందు, వెనుక వైపు అల్యూమినియం ఫ్రేమ్‌తో కూడిన కార్బన్ ఫైబర్ మోనోకాక్ (సింగిల్) షాషీని ఉపయోగించారు. ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన ఈ సూపర్ కారు 7-స్పీడ్ ట్రాన్సిమిషన్ (ఏడు గేర్లు) సిస్టమ్‌తో లభిస్తుంది. రెండు డోర్లు మాత్రమే కలిగిన లాంబోర్గినీ అవెంటేడర్ ఎల్‌పి700-4 రోడ్‌స్టర్‌లో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. ఇది సిజర్ డోర్స్‌ను (కత్తెర మాదిరిగా పైవైపుకు తెరచుకునే డోర్లు) కలిగి ఉంటుంది. ఓపెన్ టాప్ వెర్షన్ లాంబోర్గినీ అవెంటేడర్‌ ఎల్‌పి 700-4 రోడ్‌స్టర్ ధర యూరోలు 300,000 (మన దేశ కరెన్సీలో సుమారు రూ. 2.10 కోట్లు) (పన్నులు కలుపుకోకుండా).

లాంబోర్గినీకు ఇండియాలో రెండు డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి. అందులో ఒకటి ఢిల్లీకు చెందిన ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ కాగా మరొకటి ముంబైకు చెందిన ఆటోహ్యాంగర్. ప్రస్తుతం లాంబోర్గినీ దేశీయ విపణిలో లాంబోర్గినీ గల్లార్డో, లాంబోర్గినీ అవంటేడర్ మోడళ్లను మాత్రమే విక్రయిస్తుంది. ఈ రెండు మోడళ్లను పూర్తిగా విదేశాల్లో తయారైనవి. వీటిని ఇండియాకు సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకుని దేశీయ విపణిలో విక్రయిచడం జరుగుతుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 14, 2012, 13:25 [IST]
English summary
Italian supercar company Lamborghini has unveiled the much sportier and stylish version of its Aventador. After the success of the coupe version Lamborghini Aventador, now company has introduced an open top version called Lamborghini Aventador LP700-4 Roadster at the price Rs. 2.10 crore plus taxes.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+