లాంబోర్గినీ గల్లార్డో హాంకాంగ్ లిమిటెడ్ ఎడిషన్

సూపర్ కార్ల తయారీకి పెట్టింది పేరు లాంబోర్గినీ. అత్యంత వేగంతో పరుగులు పెట్టే కార్లను తయారు చేసే ఈ ఇటాలియన్ కంపెనీ సందర్భాన్ని స్పెషల్ ఎడిషన్ కార్లను ఆఫర్ చేస్తుంటుంది. తాజాగా.. హాంకాంగ్‌లోని ఓ లాంబోర్గినీ డీలర్‌షిప్ (కింగ్‌వే కార్స్) 20వ వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్ కారును రూపొందించింది.

లాంబోర్గినీ అందిస్తున్న గల్లార్డో ఎల్‌పి550-2 మోడల్‌లో హాంకాంగ్ లిమిటెడ్ ఎడిషన్ కారును కంపెనీ విడుదల చేసింది (ఈ మోల్‌ను హెచ్‌కె20 అని కూడా పిలుస్తారు). కేవలం ఎనిమిది స్పెషల్ ఎడిషన్ కార్లను మాత్రమే లాంబోర్గీనీ డిజైన్ చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ లాంబోర్గినీ గల్లార్డో ఎల్‌పి550-2 హెచ్‌కె ధర 4,75,000 అమెరికన్ డాలర్లు. అదే మన దేశంలో అయితే, సుమారు రూ.3 కోట్లకు పైమాటే.


ఈ స్పెషల్ ఎడిషన్‌ లాంబోర్గినీ గల్లార్డో ఇంటీరియర్, ఎక్స్టీరయర్లలో కొద్దిపాటి మార్పులను చేయబడ్డాయి. ఇందులో అమర్చిన 5.2 లీటర్ వి10 ఇంజన్ 550 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. అందుకే ఈ గల్లార్డోకు ఎల్‌పి550-2 అనే పేరును పెట్టడం జరిగింది. ఇది కేవలం 3.9 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది.

More from DriveSpark

Article Published On: Friday, July 6, 2012, 17:15 [IST]
English summary
Italian super car maker Lamborghini has unveiled a special edition Lamborghini Gallardo LP550-2 Hong Kong to celebrate the 20th anniversary of Kingsway Cars Lamborghini dealership in Hong Kong. The company has introduced total 8 special editions of Lamborghini Gallardo LP550-2 HK (also known as HK20). These exclusive 8 cars will be seen with a host of luxurious modifications both internal and external while pricing should be at $475,000.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+