సరికొత్త 2013 రేంజ్ రోవర్‌ను విడుదల చేసిన ల్యాండ్ రోవర్
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న ప్రముఖ బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ ల్యాండ్ రోవర్ తమ సరికొత్త 2013 రేంజ్ రోవర్ ఎస్‌యూవీని నేడు భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ల్యాండ్ రోవర్ తాజాగా మార్కెట్లోకి తీసుకువచ్చిన '2013 రేంజ్ రోవర్' 4వ తరానికి (ఫోర్త్ జనరేషన్) చెందినది. ఈ కారును పూర్తిగా బ్రిటన్‌లో తయారు చేసి, అక్కడి నుంచి ఇండియన్ మార్కెట్‌కు సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకొని విక్రయించడం జరుగుతుంది.
కొత్త రేంజ్ రోవర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్‌లో 5 లీటర్ వి8 సూపర్‌ఛార్జ్‌డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 503 బిహెచ్‌పిల శక్తిని, 625 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. అలాగే, డీజిల్ వెర్షన్‌లో 4.4 లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 335 బిహెచ్‌పిల శక్తిని, 700 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించే ఈ కొత్త కారులో 8-స్పీడ్ జెడ్ఎఫ్ ఆటోమేటిక్ గేర్‌బాక్సును ఉపయోగించారు. భారత మార్కెట్లో ఈ లగ్జరీ కార్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* రేంజ్ రోవర్ వి8 డీజిల్ వోగ్ - రూ. 1.72 కోట్లు
* రేంజ్ రోవర్ వి8 డీజిల్ ఆటోబయోగ్రఫీ - రూ. 1.79 కోట్లు
* రేంజ్ రోవర్ వి8 పెట్రోల్ ఆటోబయోగ్రఫీ - రూ. 1.84 కోట్లు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

2013 రేంజ్ రోవర్ విడుదల

2013 రేంజ్ రోవర్ విడుదల

2013 రేంజ్ రోవర్ విడుదల

2013 రేంజ్ రోవర్ విడుదల

2013 రేంజ్ రోవర్ విడుదల

2013 రేంజ్ రోవర్ విడుదల

2013 రేంజ్ రోవర్ విడుదల

2013 రేంజ్ రోవర్ విడుదల

2013 రేంజ్ రోవర్ విడుదల

2013 రేంజ్ రోవర్ విడుదల

2013 రేంజ్ రోవర్ విడుదల

2013 రేంజ్ రోవర్ విడుదల

2013 రేంజ్ రోవర్ విడుదల
అల్యూమినియం మోనోకాక్ కన్‌స్ట్రక్షన్‌తో నిర్మితమైన ప్రపంచపు మొట్టమొదటి ఎస్‌యూవీ తమదేనని, దీని వలన ఇదివరకటి రేంజ్ రోవర్‌తో పోల్చుకుంటే 2013 రేంజ్ రోవర్ 180 కేజీలు తక్కువ బరువును కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఐదు మీటర్ల పొడవు ఉండే ఈ కొత్త రేంజ్ రోవర్ కారులో వెనుక వైపు విశాలమైన క్యాబిన్ స్పేస్ ఉంటుంది. వెనుక డోర్ కొంచెం పెద్దదిగా ఉండి, ప్రయాణికులు సులువుగా కారు లోనికి/బయటకు ప్రవేశించేందుకు సౌకర్యంగా ఉంటుంది. ల్యాండ్ రోవర్ కంపెనీ 3.0 లీటర్ వి6 డీజిల్ ఇంజన్ కలిగి వేరియంట్‌ను జూన్ 2013 నుంచి విక్రయించనుంది.


Click it and Unblock the Notifications








