రాష్ట్ర మార్కెట్లో లిమిటెడ్ ఎడిషన్ వ్యాగన్ఆర్ ప్రో విడుదల
మారుతి సుజుకి ఇటీవల వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌లో విడుదల చేసిన లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్ ఇప్పుడు రాష్ట్ర మార్కెట్లో కూడా లభ్యం కానుంది. అనపు ఫీచర్లు జోడించిన స్పెషల్ ఎడిషన్‌ను వ్యాగన్ఆర్ ప్రో కారును మారుతి సుజుకి హైదరాబాద్ మార్కెట్లో కూడా విడుదల చేసింది. ఈ కొత్త కారులో సాధారణ వ్యాగన్ఆర్‌తో పోల్చుకుంటే మొత్తం రూ.20,000 విలువైన 13 అదనపు ఫీచర్లు, సదుపాయాలు లభ్యం కానున్నాయి.
సాధారణంగా, వీటిని బయటి మార్కెట్లో కొనుగోలు చేయాలంటే సుమారు రూ.30,000 లకు పైగా ఖర్చు అవుతుందని కంపెనీ పేర్కొంది. కొత్త వ్యాగన్ఆర్ ప్రో హ్యాచ్‌బ్యాక్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు, కేవలం ఇంటీరియర్లలో మాత్రమే మరిన్ని అదనపు ఫీచర్లను కస్టమర్లు పొందవచ్చు. పెట్రోల్ కార్ల అమ్మకాలు తగ్గముఖం పడుతున్న నేపథ్యంలో వీటి అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ ఆఫర్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ప్రో ఫీచర్లు, మార్కెట్లో వాటి ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* 2 డిన్ యూఎస్‌బి ఆడియో సిస్టమ్ - రూ.9,490
* కార్ మ్యాట్స్ - రూ.400
* రియర్ స్పాయిలర్ - రూ.2,900
* కార్ పెర్ఫ్యూమ్ - రూ.180
* బంపర్ ప్రొటెక్టర్ - రూ.490
* వీల్ కవర్స్ - రూ.1,180
* సైడ్ మౌల్డింగ్ - రూ.1,200
* 4-స్పీకర్ సెట్ - రూ.1,200
* బాడీ గ్రాఫిక్స్ - రూ.2,750
* కొత్త సీట్ కవర్లు - రూ.3,950
* సెక్యూరిటీ సిస్టమ్ - రూ.4,925
* స్టీరింగ్ వీల్ కవర్ - రూ.250
* స్పాయిలర్ పెయింట్ - రూ.1,085
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ప్రో ధర రూ.4.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. అయితే, దీనిపై కంపెనీ అందిస్తున్న తగ్గింపును పరిగణలోకి తీసుకుంటే దీని ధర రూ.4.17 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) అవుతుంది.


Click it and Unblock the Notifications









