జాతిపిత మహాత్మా గాంధీ కాలు మోపిన కార్లు

పాఠకులందరికీ ముందుగా స్వాతంత్ర్య దినోత్సన శుభాకాంక్షలు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో ఒకరైన మన జాతిపిత (ఫాదర్ ఆఫ్ నేషన్) మహాత్మా గాంధీ (పూర్తి పేరు: మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ) గారి గురించి తెలియని వారు ఉండకపోవచ్చు. భారతదేశపు చరిత్రలో చెరగని ముద్ర వేసుకొన్ని బాపూజీ ఉపయోగించిన వస్తువులు, తిరిగిన/గడిపిన ప్రదేశాలు కూడా ఎంతో ముఖ్యమైనవి, చరిత్ర పుటల్లో నిలిచిపోయినవే.

మహాత్మా గాంధీకు 1928లో స్థాపించిన కుమార్ టాక్సీస్‌తో మంచి అనుబంధం ఉందనే చెప్పాలి. 1928లో ఎస్. కృష్ణన్ మరియు కె.బి. కుమరన్‌లు ఈ కంపెనీను ప్రారంభించారు. ఈ కంపెనీ బాపూజీ కూడా ఓ కస్టమరే. 1928లో గాంధీజీ 'ఓవర్‌ల్యాండ్ విప్పెట్' అనే కారులోనూ మరియు 1936లో ఓ ఫోర్డ్ టి సిరీస్ కారులోనూ ప్రయాణించారు. అప్పట్లో 'ఓవర్‌ల్యాండ్ విప్పెట్' కారు ధర ఎంతో తెలుసా.. కేవలం 825 రూపాయల 12 అణాలు మాత్రమే. అంతేకాదు అప్పట్లో ఒక లీటర్ పెట్రోల్ ధర 15 పైసలు మాత్రమే.

కుమార్ టాక్సీస్‌కు చెందిన 'ఓవర్‌ల్యాండ్ విప్పెట్' కారులో గాంధీజీ తొలిసారిగా ప్రయాణిస్తున్నప్పుడు ఆ కారుకు 'జోసెఫ్ మిరాండా' అనే వ్యక్తి డ్రైవర్‌గా ఉన్నాడట. గాంధీజీ రెండోసారి కుమార్ టాక్సీస్‌ వద్దకు వచ్చి కారును అద్దెకు అడిగినప్పుడు ఇది వరకు డ్రైవ్ చేసిన మిరాండానే డ్రైవర్‌గా కావాలని ఆయన కోరారని మోహన్ దాస్ పేర్కొన్నారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, మోరాజీ దేశాయ్, జేఆర్‌డి టాటా, ఏబి వాజ్‌పేయి, విజయ మాల్య, ప్రిన్స్ ఫిలిప్, క్వీన్ ఎలిజబెత్‌లు కూడా ఒకప్పుడు ఈ కుమార్ టాక్సీక్ కస్టమర్లే.

మహాత్మా గాంధీ పుట్టుకతోనే ధనవంతుడైనప్పటికీ, విలాసాలకు మాత్రం దూరంగానే బ్రతికాడు. ఎక్కువ దూరం కాలిబాటనే ప్రయాణం చేసేవాడు. బాపూజీ 1927లో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ సెంట్రల్ జైలు నుంచి ఓ ఫోర్డ్ టి సిరీస్ కారులో ప్రయాణం చేశాడు. ఆ తర్వాత ఈ కారు ఎన్నో చేతులు మారి ప్రస్తుతం పూనేలోని అబ్బాస్ జందన్‌వాలా వద్దకు చేరింది. పురాతన కార్లను సేకరించడమంటే అబ్బాస్‌కు భలే సరదా. అతని వద్ద సుమారు 30 పురాతన కార్లు ఉన్నాయి.

వాటిల్లోకెల్లా ఈ ఫోర్డ్ టి సిరీస్ అత్యంత ప్రాముఖ్యమైనది. పూనేలోని వివిధ పురాతన కార్ల షోరూమ్‌లలో ఈ కారును ప్రదర్శించటం కూడా జరిగింది. బాపూజీ ప్రయాణించిన కార్లలో చెప్పుకోదగిన మరొక కారు రాజ్‌కోట్ మహారాజుకు చెందిన 'స్టార్ ఆఫ్ ఇండియా' అనే పురాతన రోల్స్ రాయిస్ కారు. ఈ కారును మహారాజు కోసం ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ రాజ్‌కోట్ రాజ కుటుంబానికి మహాత్మా గాంధీ తండ్రి కరంచంద్ దివాన్‌గా పనిచేసేవారు. ఈ కారులో మహాత్మా గాంధీ, ఇంగ్లాంజ్ రాణి ప్రయాణించారని చెప్పుకుంటారు.

More from DriveSpark

Article Published On: Tuesday, August 14, 2012, 17:24 [IST]
English summary
Mahatma Gandhi is a man who is revered all over the world. Any thing or place associated with the father of our nation has become important and here is one thing that will be liked by several auto enthusiasts.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+