వెరిటో సెడాన్‌లో హ్యాచ్‌బ్యాక్ వెర్షన్ విడుదల: మహీంద్రా
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న తొలి సెడాన్ మహీంద్రా వెరిటో (గతంలో మహీంద్రా రీనాల్ట్ లోగాన్) ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఓ సరికొత్త హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ తయారు చేస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో విడుదల కానుంది. ప్రతి నెలా 3,000 వెరిటో హ్యాచ్‌బ్యాక్ కార్లను విక్రయించాలని ఎమ్ అండ ఎమ్ లక్ష్యంగా నిర్ణయించుకుంది.
వెరిటోను తొలిసారిగా ఇండియాలో 2007లో (అప్పట్లో దీని పేరు లోగాన్) ఫ్రెంచ్ కార్ మేకర్ రెనో సహకారంతో మహీంద్రా విడుదల చేసింది. మహీంద్రా-రెనో జాయింట్ వెంచర్‌లో రెనోకు 41 శాతం వాట ఉండేది. అయితే, ఈ జెవీ నష్టాల్లో నడవటంతో 2009లో రెనో మొత్తం వాటాను మహీంద్రా కొనుగోలు చేసింది. అంతేకాకుండా.. లోగాన్ కారును వెరిటోగా పేరు మార్చి కారు డిజైన్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్‌లలో మార్పులు చేసి మార్కెట్లో ప్రవేశపెట్టింది.
లోగాన్‌గా మార్కెట్లో లభిస్తున్నప్పు కేవలం నెలకు 350 యూనిట్లు మాత్రమే అమ్ముడవుతున్న ఈ కారు, పేరు మార్చి కొత్త డిజైన్, ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత నెలకు 20010-11లో నెలకు 10,100 యూనిట్లకు పెరిగింది. తొలుత ఈ కారును ఎక్కువగా ప్రైవేట్ క్యాబ్‌ల వినియోగిస్తుండగా, కొత్త వెరిటోనూ వ్యక్తిగత అవసరాల కోసం ఎక్కువగా కొనుగోలు చేయటాన్ని కూడా మనం గమనించవచ్చు.
అంతటి సక్సెస్ సాధించిన ఈ వెరిటో సెడాన్ ఆధారంగా రూపొందుతున్న వెరిటో హ్యాచ్‌బ్యాక్ కూడా మార్కెట్లో మంచి క్రేజ్‌ను సంపాధించుకోవటం ఖాయం. మరో నాలుగు నెలల్లో వెరిటో హ్యాచ్‌బ్యాక్ దేశీయ విపణిలోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మహీంద్రా అందిస్తున్న జైలో ఎమ్‌పివిలో ఓ మినీ జైలోను, అలాగే 4-సీటర్ ఎలక్ట్రిక్ కారు రేవా ఎన్ఎక్స్ఆర్ మోడళ్లను కూడా మహీంద్రా అండ్ మహీంద్రా ఈ సంవత్సరంలోనే మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.


Click it and Unblock the Notifications








