అక్టోబర్ 17న మార్కెట్లో విడుదల కానున్న శాంగ్‌యాంగ్ రెక్స్టన్

By Ravi

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహనాల తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) స్వాధీనం చేసుకున్న కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ శాంగ్‌యాంగ్ నుంచి తొలి ఉత్పత్తిని భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు ముహుర్తం ఖరారు చేసింది. భారత మార్కెట్ కోసం మహీంద్రా-శాంగ్‌యాంగ్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) 'రెక్స్టన్' ఈనెల 17న మార్కెట్లో విడుదల కానుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శాంగ్‌యాంగ్ రెక్స్టన్ హై-ఎండ్ ఎస్‌యూవీని అక్టోబర్ 17, 2012న ముంబైలో విడుదల చేస్తామని మహీంద్రా ఓ ప్రకటనలో పేర్కొంది.

అనంతరం న్యూఢిల్లీ, బెంగుళూరు వంటి ఇతర నగరాల్లో దఫాల వారీగా విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. ఇండియాలో శాంగ్‌యాంగ్ పోర్ట్‌ఫోలియో నుంచి రానున్న మొట్టమొదటి ఉత్పత్తి రెక్స్టన్. శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఎస్‌యూవీ ఇప్పటికే 66 దేశాల్లో లభ్యమవుతోంది. కొరియాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ శాంగ్‌యాంగ్‌ను మహీంద్రా అండ్ మహీంద్రా గడచిన మార్చి 2012 స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో విడుదల కానున్న శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఎస్‌యూవీ మూడవ తరానికి (థర్డ్ జనరేషన్)కు చెందినది.

SsangYong Rexton

ఆకట్టుకునే స్టయిలింగ్, విలాసవంతమైన ఇంటీరియర్స్, ఆన్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ పెర్ఫామెన్స్‌పై సుపీరియర్ హ్యాండ్లింగ్ వంటి విశిష్టతలు శాంగ్‌యాంగ్ రెక్స్టన్ సొంతం. ఇందుల మెరుగైన పనితీరును కనబరిచే డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఎస్‌యూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను విడుదల సమయంలో వెల్లడిస్తామని కంపెనీ పేర్కొంది. శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఎస్‌యూవీని మహీంద్రా ఇండియాలోనే అసెంబ్లింగ్ చేయనుంది. ఇందు కోసం రూ.1,500 కోట్ల పెట్టుబడితో మహీంద్రా ఓ అసెంబ్లింగ్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. ఈ కొత్త కారుకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, October 3, 2012, 19:27 [IST]
English summary
Mahindra & Mahindra Ltd. (M&M Ltd.), India’s leading SUV manufacturer, today announced that it would be launching its highly anticipated high–end SUV SsangYong Rexton in India on October 17th in Mumbai. This would be followed by launches in the cities of New Delhi and Bangalore and a phase wise roll out in other markets.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+