కొత్త జైలో ఎమ్‌పివి వారంటీని పెంచిన మహీంద్రా
ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న సరికొత్త ఎమ్‌పివి 'మహీంద్రా జైలో' వారంటీని పెంచింది. ప్రస్తుతం కొత్త మహీంద్రా జైలో ఎమ్‌పివి 1,00,000 కి.మీ. లేదా 3 ఏళ్ల వారంటీతో లభిస్తుంది. గతంలో ఇది 50,000 కి.మీ. లేదా రెండేళ్లుగా ఉండేది. 2009లో భారత మార్కెట్లో విడుదలైన మహీంద్రా జైలో గడచిన నెలలో 1,00,000 అమ్మకాల మార్కును తాకింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొత్త జైలో వారంటీని 1,00,000 కి.మీ. పెంచడం జరిగింది.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త జైలోను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇదివరకటి జైలోతో పోల్చుకుంటే సరికొత్త మహీంద్రా జైలో సుమారు 50కు పైగా మార్పులు ఉన్నాయి. ఈ 2012 వెర్షన్ జైలో ఎమ్‌పివి డి2, డి4, ఈ4, ఈ8, ఈ9 అనే ఐదు వేరియంట్లలో, ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభించనుంది. హైదరాబాద్ మార్కెట్లో కొత్త జైలో ధరలు రూ.7.33 లక్షల నుండి రూ.10.51 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.
కొత్త మహీంద్రా జైలో మూడు రకాల ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. ఈ9 వేరియంట్‌లో స్కార్పియోలో ఉపయోగించే 2.2లీటర్ ఎమ్‌హాక్ ఇంజన్‌ను ఉపయోగించారు, ఇది 120 బిహెచ్‌పిల శక్తిని, 290 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. అలాగే, ఈ4, ఈ8 వేరియంట్లలో ఉపయోగించిన 2.5 లీటర్ ఎమ్ఈగల్ ఇంజన్ 112 బిహెచ్‌పిల శక్తిని, డి2, డి4 వేరియంట్లలో ఉపయోగించిన ఎమ్‌డిఐ ఇంజన్ 95 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. ఐదు వేరియంట్లలో లభ్యమయ్యే కొత్త జైలో ఎమ్‌పివి వేరియంట్‌ను బట్టి లీటరుకు 13-15 కి.మీ. మైలేజీనిస్తుంది.
రాష్ట్ర మార్కెట్లో మహీంద్రా జైలో ఎమ్‌పివి ధరలు ఈ విధంగా ఉన్నాయి:
మహీంద్రా జైలో ఈ9 బిఎస్4 - రూ.10,50,984.00
మహీంద్రా జైలో డి4 బిఎస్4 - రూ.7,88,202.00
మహీంద్రా జైలో డి4 బిఎస్3 - రూ.7,75,133.00
మహీంద్రా జైలో డి2 బిఎస్4 - రూ.7,46,028.00
మహీంద్రా జైలో ఈ4 ఏబిఎస్ బిఎస్3 - రూ.8,40,415.00
మహీంద్రా జైలో డి2 బిఎస్3 - రూ.7,32,958.00
మహీంద్రా జైలో ఈ8 ఏబిఎస్ బిఎస్3 - రూ.9,17,906.00
మహీంద్రా జైలో ఈ4 ఏబిఎస్ బిఎస్4 - రూ.8,50,078.00
మహీంద్రా జైలో ఈ8 ఏబిఎస్ బిఎస్4 - రూ.9,29,516.00
మహీంద్రా జైలో ఈ8 ఏబిఎస్ ఎయిర్‌బ్యాగ్ బిఎస్4 - రూ.9,68,704.00
మహీంద్రా జైలో ఈ8 ఏబిఎస్ ఎయిర్‌బ్యాగ్ బిఎస్3 - రూ.9,56,523.00
మహీంద్రా జైలో ఈ4 బిఎస్3 - రూ.8,16,240.00
మహీంద్రా జైలో ఈ4 బిఎస్4 - రూ.8,25,903.00


Click it and Unblock the Notifications









