జులై 26న మార్కెట్లోకి రానున్న కొత్త మహీంద్రా వెరిటో
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న తొలి సెడాన్ వెరిటో (గతంలో రెనో లోగాన్)లో ఓ సరికొత్త వెర్షన్‌ను విడుదల చేయనుందని తెలుగు డ్రైవ్ స్పార్క్ గతంలో పలు కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా.. రేపు (జులై 26, 2012న) రిఫ్రెష్డ్ వెర్షన్ మహీంద్రా వెరిటోను ఎమ్ అండ్ ఎమ్ అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
దేశ రాజధాన్ని ఢిల్లీలో సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మహీంద్రా వెరిటోను కంపెనీ విడుదల చేయనుంది. న్యూ లుక్ వెరిటో సెడాన్ (రిఫ్రెష్)ను మహీంద్రా అండ్ మహీంద్రా ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా ఈ కారును విడుదల చేయనున్నారు. ఈ విడుదలకు సంబంధించిన వేదిక, సమయం తదితర వివరాలు ఇలా ఉన్నాయి:
తేది: జులై 26, 201 (గురువారం)
సమయం: మధ్యాహ్నం 12.30 నిమిషాలకు
వేదిక: హోటల్ ఐటిసి మయూరా షెరటాన్,
డిప్లమాటిక్ ఎన్‌క్లేవ్, సర్దార్ పటేల్ మార్గ్,
న్యూఢిల్లీ - 110 021.
మహీంద్రా అండ్ మహీంద్రా మరియు జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం రెనో ఇండియా కంపెనీలు ఉమ్మడిగా అభివృద్ధి చేసిన "లోగాన్" సెడాన్‌ను, ఎమ్ అండ్ ఎమ్ "వెరిటో"గా పేరు మార్చి, కారుకు కొద్దిపాటి మార్పులు చేర్పులను చేసిన గడచిన ఏప్రిల్ నెలలో దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
ఈ రెండు కంపెనీల జాయింట్ వెంచర్‌లో రెనో ఇండియాకు ఉన్న 49 శాతం వాటాను ఎమ్ & ఎమ్ సొంతం చేసుకోవడంతో ఈ కారు పూర్తిగా మహీంద్రా చేతుల్లోకి వచ్చింది. దీంతో ఈ కారులో కొద్దిపాటి మార్పులు చేసి పేరును లోగోను మార్చి మార్కెట్లోకి విడుదల చేసింది. కాగా.. కొత్తగా మార్కెట్లోకి విడుదల కానున్న రిఫ్రెష్డ్ వెర్షన్ వెరిటో సెడాన్ పొడవులో 4 మీటర్ల కన్నా తక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కొత్త మహీంద్రా వెరిటో గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








