ఈ ఏడాది 6 కొత్త మోడళ్లను తీసుకురానున్న మహీంద్రా
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. ఈ కొత్త మోడళ్లతో 10-12 శాతం అమ్మకాల వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఎమ్ అండ్ ఎమ్ (అటోమొబైల్) అధ్యక్షులు పవన్ గోయంక వెల్లడించారు. రానున్న మూడు ఆర్థిక సంవత్సరాలకు గానూ రూ.5,000 కోట్లతో పెట్టుబడులను వెచ్చించనున్నామని ఆయన తెలిపారు.
కాగా.. కంపెనీ విడుదల చేయబోయే మోడళ్ల వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, కొత్త మార్కెట్లోకి రానున్న మోడళ్లలో మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ కారు, స్కార్పియో ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ, వెరిటో హ్యాచ్‌బ్యాక్, మినీ జైలోలు ఉండే అవకాశం ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న గ్లోబల్ మోడల్ ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని వచ్చే నెలలో అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నామని ఆయన వివరించారు.
మహీంద్రా వెరిటోలో హ్యాచ్‌బ్యాక్ వెర్షన్:
మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న తొలి సెడాన్ మహీంద్రా వెరిటో (గతంలో మహీంద్రా రీనాల్ట్ లోగాన్) ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఓ సరికొత్త హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ తయారు చేస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో విడుదల కానుంది. ప్రతి నెలా 3,000 వెరిటో హ్యాచ్‌బ్యాక్ కార్లను విక్రయించాలని ఎమ్ అండ ఎమ్ లక్ష్యంగా నిర్ణయించుకుంది.
వెరిటోను తొలిసారిగా ఇండియాలో 2007లో (అప్పట్లో దీని పేరు లోగాన్) ఫ్రెంచ్ కార్ మేకర్ రెనో సహకారంతో మహీంద్రా విడుదల చేసింది. మహీంద్రా-రెనో జాయింట్ వెంచర్‌లో రెనోకు 41 శాతం వాట ఉండేది. అయితే, ఈ జెవీ నష్టాల్లో నడవటంతో 2009లో రెనో మొత్తం వాటాను మహీంద్రా కొనుగోలు చేసింది. అంతేకాకుండా.. లోగాన్ కారును వెరిటోగా పేరు మార్చి కారు డిజైన్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్‌లలో మార్పులు చేసి మార్కెట్లో ప్రవేశపెట్టింది.


Click it and Unblock the Notifications








