మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఆటోమేటిక్ విడుదల ఆలస్యం!

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న పాపులర్ గ్లోబల్ మోడల్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీలో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్ ఇప్పట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ500 కేవలం మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వేరియంట్‌లో మాత్రమే లభ్యమవుతోంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసే సమయంలో కంపెనీ ఇందులో ఓ ఆటోమేటిక్ వెర్షన్‌ను కూడా మార్కెట్లోకి తీసుకువస్తామని చెప్పింది. అయితే, ఇందుకు సంబంధించిన ఓ స్పష్టమైన సమయాన్ని మాత్రం కంపెనీ తెలుపలేదు. కాగా.. ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ల సరఫరా నిలిచిపోయింది.

అందుకే, కంపెనీ అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ మహీంద్రా స్కార్పియోలో కూడా ఆటోమేటిక్ వేరియంట్ త్వరలోనే కనుమరుగు కానుంది. మహీంద్రా వాహనాల్లో ఉపయోగించే సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఆస్ట్రేలియాకు చెందిన డ్రైవ్‌ట్రైన్ సిస్టమ్ ఇంటర్నేషల్ (డిఎస్ఐ) సరఫరా చేసేది. అయితే, ప్రస్తుతం ఈ కంపెనీ నుంచి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌లను సరఫరా నిలిచిపోయింది.

ఈ నేపథ్యంలో, ఉన్న మోడళ్లకే ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌లు లభ్యం కాకపోతుండటంతో, కొత్తగా మార్కెట్లో వచ్చే మోడళ్ల పరిస్థితి ఏంటనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా నిలుస్తోంది. ఎమ్ అండ్ ఎమ్ స్వాధీనం చేసుకున్న కొరియన్ కంపెనీ శాంగ్‌యాంగ్‌కు కూడా కూడా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌లను డిఎస్ఐనే సరఫరా చేస్తుంది. దీంతో, శాంగ్‌యాంగ్‌ నుంచి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌లను పొందే అవకాశం ఎమ్ అండ్ ఎమ్‌కు లేకుండా పోయింది.

ఏదేమైనప్పటికీ, కంపెనీ ఇతర విడిభాగాల కంపెనీతో మహీంద్రా ఒప్పందాన్ని కుదుర్చుకొని ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌లను కొనుగోలు చేసినట్లయితే, స్కార్పియో, ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీలలో ఆటోమేటిక్ వేరియంట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం మహీంద్రా ఎక్స్‌యూవీ500 మూడు వేరియంట్లలో (డబ్ల్యూ6, డబ్ల్యూ8, డబ్ల్యూ8 ఆల్-వీల్ డ్రైవ్) లభ్యమవుతోంది. ఇందులో 2179సీసీ ఎమ్-హాక్140 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని, 330 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ500 వేరియంట్లు, ధరల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

* మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ6 - రూ. 11,58,472
* మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 (ఫ్రంట్-వీల్ డ్రైవ్) - రూ. 13,03,970
* మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 (ఆల్-వీల్ డ్రైవ్) - రూ. 14,10,904

More from DriveSpark

Article Published On: Friday, August 17, 2012, 13:15 [IST]
English summary
Another sad news for Mahindra XUV 500 buyers. According to recent reports, India's leading SUV manufacturer Mahindra and Mahindra (M and M) might delay the launch of automatic version XUV 500 due to the shortage of automatic transmissions to M and M.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+