మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ పేరు క్వాంటో

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న బహుళ ప్రయోజన వాహనం జైలో ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఓ 5-సీటర్ కాంపాక్ట్ ఎస్‌‌యూవీని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ మినీ జైలోగా చెప్పుకుంటూ వచ్చిన ఈ బుజ్జి ఎస్‌యూవీకి కంపెనీ ఓ పేరును ఖరారు చేసింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీకి 'మహీంద్రా క్వాంటో' అనే పేరును నిర్ణయించామని ఎమ్ అండ్ ఎమ్ ఓ ప్రకటనలో పేర్కొంది.

వచ్చే నెల ద్వితీయార్థంలో (సెప్టెంబర్ 3వ వారం) మహీంద్రా క్వాంటో మార్కెట్లో విడుదల కానుంది. ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ అయినప్పటికీ మంచి స్పేస్‌‌ను, మరింత పవర్‌ను సపీరియర్ పెర్ఫామెన్స్‌ను కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఎక్సైజ్ సంకంలో రాయితీలను పొందేందుకు గాను కంపెనీ ఈ ఎస్‌యూవీ పొడవును 4 మీటర్ల కన్నా తక్కువ ఉండేలా డిజైన్ చేసింది.

స్పేస్, పవర్‌ను ప్రతిబింబించేలా ఈ ఎస్‌యూవీకి 'క్వాంటో' అనే పేరును పెట్టారు. ఈ పేరును క్వాంటమ్ అనే ఆంగ్ల పదం నుంచి గ్రహించారు. అధిక స్థలం, అధిక శక్తి, అధిక సీట్లు మరియు మెరుగైన పెర్ఫామెన్స్‌లకు ప్రతీగా ఈ పేరును పెట్టినట్లు కంపెనీ వివరిచింది. క్వాంటో మహీంద్రా ఎస్‌యూవీల డిఎన్ఏను కలిగి ఉండి హ్యాచ్‌బ్యాక్, సెడాన్‌లలోని సౌకర్యాలను అందిస్తుంది.

అనేక మంది వినియోగదారుల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకొని కంపెనీ తమ క్వాంటో ఎస్‌యూవీని అభివృద్ధి చేసింది. డిజైన్, పెర్ఫామెన్, ఫీచర్ల విషయంలో ఇది వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఉంటుందని కంపెనీ వివరిచింది. మహీంద్రా అందిస్తున్న ఉత్పత్తులలో కెల్లా ఇదే అత్యంత చిన్న ఎస్‌యూవీ కావటం మరొక విశేషం. సెప్టెంబర్ 2012 నెల రెండవ భాగంలో మహీంద్రా క్వాంటో మార్కెట్లోకి రానుంది. ఈ బుజ్జి ఎస్‌యూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, August 28, 2012, 13:41 [IST]
English summary
Mahindra and Mahindra has named its soon to be launched compact SUV as the Quanto. The Quanto was previously referred to as the mini Xylo. The new compact SUV will be launched during the second half of September. Built on the Ingenio platform, the Mahindra Quanto is a sub four meter SUV.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+