మహీంద్రా క్వాంటో కాంపాక్ట్ ఎస్‌యూవీలో 7-సీటర్ ఆప్షన్

దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న మల్టీ యుటిలిటీ వెహికల్ (ఎమ్‌యూవీ) జైలో ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ అభివృద్ధి చేసిన కాంపాక్ట్ ఎస్‌‌యూవీ 'మహీంద్రా క్వాంటో' 7-సీటర్ ఆప్షన్‌తో లభ్యం కానున్నట్లు తెలుస్తోంది. మహీంద్రా క్వాంటో పొడవులో నాలుగు మీటర్ల కన్నా తక్కువగా ఉన్నప్పటికీ, ఇంటీరి స్పేస్ విషయంలో మాత్రం మంచి విశాలమైన స్థలాన్ని కలిగి ఉంటనుంది.

ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న మహీంద్రా క్వాంటో స్పైషాట్‌లను గమనిస్తే.. మూడవ వరుసలో ఎదురెదురుగా ఉండేలా రెండు సీట్లను (రెనో డస్టర్, నిస్సాన్ ఇవాలియా కార్లలో ఉండే విధంగా) అమర్చటం జరిగింది. ఈ రెండు సీట్లను అవసరం లేదనుకుంటే మడిచి పెట్టి ఆ స్థలాన్ని లగేజ్ స్పేస్ కోసం ఉపయోగించుకోవచ్చు. దూరప్రయాణాలు వెళ్లే వారు, లగేజ్ స్పేస్‌ను తక్కువగా ఉపయోగించుకునే వారిని దృష్టిలో ఉంచుకొని దీని సీటింగ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

మూడవ వరుసలో సీట్లను ఏర్పాటు చేసినప్పటికీ, రెండవ వరుసలో సీట్లలో మంచి లెగ్ రూమ్ ఉండటాన్ని గమనించవచ్చు. మహీంద్రా క్వాంటో ముందువైపు డిజైన్ 2012 మహీంద్రా జైలో డిజైన్‌ను పోలి ఉంటుంది. మహీంద్రా క్వాంటో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు మరియు ఎక్సైజ్ రాయితీలను పొందేందుకు మహీంద్రా జైలో ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి, నాలుగు మీటర్ల కన్నా పొడవు తక్కువ ఉండేలా దీనిని తీర్చిదిద్దటం జరిగింది.

అందుకే దీని ధర కూడా తక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ సెగ్మెంట్లోని రెనో డస్టర్, ప్రీమియర్ రియో వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. మహీంద్రా క్వాంటో సెప్టెంబర్ 3వ వారంలో మార్కెట్లో విడుదల కానుంది. అన్ని వర్గాల వినియోగదారుల అభిరుచులకు తగిన విధంగా మహీంద్రా ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేసింది. అనేక మంది వినియోగదారుల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ తమ క్వాంటో ఎస్‌యూవీని అభివృద్ధి చేసింది.

మహీంద్రా క్వాంటోలో శక్తివంతమైన 1.5 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. డిజైన్, పెర్ఫామెన్, ఫీచర్ల విషయంలో ఇది వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఉండనుంది. ప్రస్తుతం మహీంద్రా అందిస్తున్న ఎస్‌యూవీలలో కెల్లా క్వాంటోనే అత్యంత చిన్న ఎస్‌యూవీ. ఈ బుజ్జి ఎస్‌యూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, August 31, 2012, 18:43 [IST]
English summary
Mahindra and Mahindra has named its soon to be launched compact SUV as the Quanto. The Quanto is expected to have 7-seater option like Renault Duster. The new compact SUV will be launched during the second half of September.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+