హైదరాబాద్ మార్కెట్లోకి విచ్చేసిన మహీంద్రా క్వాంటో

By Ravi

యుటిలిటీ వాహనాల తయారీలో పేరుగాంచిన మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) ఇటీవల దేశీయ విపణిలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్‌యూవీ 'మహీంద్రా క్వాంటో'ను కంపెనీ తాజాగా రాష్ట్ర మార్కెట్లో కూడా విడుదల చేసింది. హైదరాబాద్‌లో క్వాంటో ధరలు రూ.6.06 లక్షల నుంచి రూ.7.67 లక్షల (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) రేంజ్‌లో ఉన్నాయి.

తక్కువ ధరకే శక్తివంతమైన ఎస్‌యూవీని అందించాలనే ఉద్దేశ్యంతో ఎమ్ అండ్ ఎమ్ ఈ క్వాంటో ఎస్‌యూవీని తీర్చిదిద్దింది. ప్రభుత్వం నుంచి ఎక్సైజ్ రాయితీలను పొందేందుకు గాను ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ పొడవును 4 మీటర్ల కన్నా తక్కువ ఉండేలా డిజైన్ చేశారు. దీని వలన సరమైన ధరకే మహీంద్రా క్వాంటోనో కంపెనీ ఆఫర్ చేయగలుగుతోంది.


ఎమ్‌పివి లాంటి ఫ్లెక్సిబిలిటీని, ఎస్‌యూవీ లాంటి పవర్‌ను, హ్యాచ్‌బ్యాక్ లాంటి స్టయిల్‌ను ఒకే వాహనంలో కోరుకునే వారికి మహీంద్రా క్వాంటో చక్కటి ఆప్షన్‌గా నిలుస్తుంది. మహీంద్రా నుంచి అత్యంత పాపులర్ అయిన బహుళ ప్రయోజన వాహనం (ఎమ్‌పివి) జైలో ఆధారంగా చేసుకొని కంపెనీ మహీంద్రా క్వాంటో కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేసింది.

మహీంద్రా క్వాంటోలో శక్తివంతమైన 1.5 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో‌ఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 100 బిహెచ్‌పిల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభించే మహీంద్రా క్వాంటో లీటర్ డీజిల్‌కు 17.2 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

మహీంద్రా క్వాంటో మొత్తం నాలుగు వేరియంట్లలో (సి2 సి4, సి6, సి8) లభిస్తుంది. టాప్ ఎండ్ వేరియంట్‌లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), రెండు ఎయిర్‌బ్యాగ్స్, రివర్స్ పార్క్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది ఫైరీ బ్లాక్, జావా బ్రౌన్, మిస్ట్ సిల్వర్, టోరిడార్ రెడ్, డైమండ్ వైట్, రాకీ బీజ్ అనే ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది. హైదరాబాద్ మార్కెట్లో మహీంద్రా క్వాంటో ధరలు ఈ విధంగా ఉన్నాయి:

* మహీంద్రా క్వాంటో సి2 - రూ.6.06 లక్షలు
* మహీంద్రా క్వాంటో సి4 - రూ.6.61 లక్షలు
* మహీంద్రా క్వాంటో సి6 - రూ.7.14 లక్షలు
* మహీంద్రా క్వాంటో సి8 - రూ.7.67 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

More from DriveSpark

Article Published On: Wednesday, September 26, 2012, 10:42 [IST]
English summary
Mahindra has launched its first compact SUV, the Quanto in Hyderabad with a starting price of Rs.6.06 Lakhs (Ex-showroom, Hyderabad). The Quanto, which was previously called as the mini Xylo carries forward much of the design elements from the car that it is based on.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+