మహీంద్రా క్వాంటోకు 2 నెలల్లో 10,000 బుకింగ్‌లు

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న తొలి కాంపాక్ట్ ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) 'మహీంద్రా క్వాంటో'కు భారత మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఆకర్షనీయమైన డిజైన్, సరసమైన ధర, సాటిలేని పెర్ఫామెన్స్, ఎక్కువ సీటింగ్ కెపాసిటీ (7 సీట్స్), మెరుగైన మైలేజ్ (17.2 కెఎమ్‌పిఎల్), నమ్మకమైన బ్రాండ్ వంటి అనేక ఫీచర్లతో ఇది కొనుగోలుదారులను ఇట్టే ఆకట్టుకుంటోంది.

మహీంద్రా క్వాంటో కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో విడుదలైన రెండు నెలల్లోనే ఇది పది వేల మంది వినియోగదారులను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 21, 2012న మహీంద్రా క్వాంటోకు దేశవ్యాప్తంగా బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ మోడల్‌కు ఇప్పటి వరకూ 10,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు ఎమ్ అండ్ ఎమ్ ఓ ప్రకటనలో పేర్కొంది.

మహీంద్రా క్వాంటో - బుకింగ్స్

మహీంద్రా క్వాంటో - బుకింగ్స్

ఈ మోడల్‌కు ఇప్పటి వరకూ 10,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు ఎమ్ అండ్ ఎమ్ ఓ ప్రకటనలో పేర్కొంది. మహీంద్రా అండ్ మహీంద్రా సెప్టెంబర్ 21, 2012న క్వాంటోకు దేశవ్యాప్తంగా బుకింగ్‌లు ప్రారంభించింది.

మహీంద్రా క్వాంటో - డిజైన్

మహీంద్రా క్వాంటో - డిజైన్

మహీంద్రా అందిస్తున్న అందిస్తున్న పాపులర్ ఎమ్‌పివి జైలోను ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ క్వాంటోను అభివృద్ది చేసింది. ఎమ్‌పివి, ఎస్‌యూవీ, హ్యాచ్‌బ్యాక్‌ల కలయికతో రూపుదిద్దుకున్న మహీంద్రా క్వాంటో పొడవులో నాలుగు మీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది.

మహీంద్రా క్వాంటో - ఇంజన్

మహీంద్రా క్వాంటో - ఇంజన్

మహీంద్రా క్వాంటోలో శక్తివంతమైన 1.5 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో‌ఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 100 బిహెచ్‌పిల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.

మహీంద్రా క్వాంటో - మైలేజ్

మహీంద్రా క్వాంటో - మైలేజ్

మహీంద్రా క్వాంటో లీటర్ డీజిల్‌కు 17.2 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం).

మహీంద్రా క్వాంటో - వేరియంట్స్

మహీంద్రా క్వాంటో - వేరియంట్స్

మహీంద్రా క్వాంటో మొత్తం నాలుగు వేరియంట్లలో (సి2 సి4, సి6, సి8) లభిస్తుంది.

మహీంద్రా క్వాంటో - ఫీచర్స్

మహీంద్రా క్వాంటో - ఫీచర్స్

మహీంద్రా క్వాంటోలో డిజిటల్ డ్రైవ్ అసిస్ట్ సిస్టమ్, మైక్రో హైబ్రిడ్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్, ఇంటెలిజెంట్ రివర్స్ అసిస్ట్, సిడి, ఎమ్‌పి3, యూఎస్‌బి, ఆక్స్-ఇన్ సపోర్ట్‌తో కూడిన 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి), డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, హై స్పీడ్ వార్నింగ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా క్వాంటో - కలర్స్

మహీంద్రా క్వాంటో - కలర్స్

మహీంద్రా క్వాంటో ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది. అవి.. ఫైరీ బ్లాక్, జావా బ్రౌన్, మిస్ట్ సిల్వర్, టోరిడార్ రెడ్, డైమండ్ వైట్, రాకీ బీజ్.

మహీంద్రా క్వాంటో - ధరలు

మహీంద్రా క్వాంటో - ధరలు

* మహీంద్రా క్వాంటో సి2 - రూ.6.07 లక్షలు

* మహీంద్రా క్వాంటో సి4 - రూ.6.62 లక్షలు

* మహీంద్రా క్వాంటో సి6 - రూ.7.14 లక్షలు

* మహీంద్రా క్వాంటో సి8 - రూ.7.67 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

More from DriveSpark

Article Published On: Wednesday, November 14, 2012, 11:31 [IST]
English summary
Mahindra has announced that it has received over 10,000 bookings from customers for its newly launched compact and versatile SUV Quanto within 2 months of launch. Bookings for the Quanto had opened across India from September 21st, 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+