మహీంద్రా నుంచి దీపావళి కానుక రానున్న మినీ జైలో

ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) నుంచి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మినీ జైలో ఎమ్‌పివి విడుదలకు ముస్తాబవుతోంది. ఎమ్‌పివి (మల్టీ యుటిలిటీ వాహనాల) సెగ్మెంట్లో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా తమ జైలో ఎమ్‌పివి ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసిన సరికొత్త మినీ జైలో దేశీయ విపణిలో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

ఇప్పటికే, పలు రహదారులపై మినీ జైలోను పరీక్షించిన మహీంద్రా, వచ్చే దీపావళికి ఈ కారును మార్కెట్లో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. మినీ జైలో ప్రస్తతుం మార్కెట్లో లభిస్తున్న జైలో పోల్చుకుంటే పొడవు తక్కువగా ఉంటుంది. ఇది 5-సీటర్ ఆప్షన్‌తో లభ్యం కానుంది. కంపెనీ ఇటీవల మార్కెట్లోకి విడుదల సరికొత్త 2012 మహీంద్రా జైలో ఎమ్‌పివిలో ఉండే అన్ని ఫీచర్లు ఈ మినీ జైలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టాప్ ఎండ్ వేరియంట్ మినీ జైలోలో వాయిస్ కమాండ్ టెక్నాలజీ ఫీచర్ కూడా అందుబాటులో ఉండొచ్చని అంచనా. మీనీ జైలో హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్ గ్రిల్, బానెట్‌లు జైలో మాదిరిగానే ఉంటాయి. ఫ్రంట్ వీల్ ఆర్చ్‌ను కొద్దిగా తగ్గించబడింది, అలాగే రియర్ వీల్ ఆర్చ్‌ను వెనుక డోరుకు కలపబడింది. 2012 జైలోతో పోల్చుకుంటే, మినీ జైలో బాడీ ప్యానెల్స్, వెనుక బంపర్‌లు చిన్నవిగా ఉంటాయి. స్పేర్ వీల్‌ను మినీ జైలోకు వెనుక భాగంలో ఫిక్స్ చేసి, దానిని ప్లాస్టిక్ వీల్ కవర్‌తో కప్పబడి ఉంటుంది.

ప్రస్తుత మహీంద్రా జైలో 2.2 లీటర్ ఎమ్-హాక్ ఇంజన్‌ను ఉపయోగించబడి ఉంది. అయితే, మినీ జైలోలో దీనికి బదులు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. దీన్ని బట్టి చూస్తుంటే, మినీ జైలో మరింత అధిక మైలేజీని ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఎక్సైజ్ సుంకం రాయితీలను పొందేందుకు మహీంద్రా ఈ మినీ జైలోను తయారు చేసింది. ఎక్సైజ్ సుంకంలో రాయితీని పొందటం వలన మినీ జైలో ధర కూడా తక్కువగానే ఉండే అవకాశం ఉంది. మినీ జైలో ధర రూ.5 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Thursday, August 2, 2012, 12:06 [IST]
English summary
Mahindra much hyped and long expected compact SUV, the mini Xylo is set for a September 2012 launch. The mini Xylo has been under development since quite a long time. Mahindra had earlier stated that the mini Xylo will be launched by this year's festive season and latest reports indicate the launch date will be in September.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+