మహీంద్రా శాంగ్‌యాంగ్ రెక్స్టన్ - చిత్రాలతో కూడిన సమీక్ష
ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) స్వాధీనం చేసుకున్న కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ శాంగ్‌యాంగ్ ఇటీవలే ముంబై, ఢిల్లీ మార్కెట్లలో విడుదల చేసిన హై-ఎండ్ ప్రీమియం ఎస్‌యూవీ 'రెక్స్టన్'ను మహీంద్రా ఇప్పుడు మరిన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. మహీంద్రా తమ శాంగ్‌యాంగ్ రెక్స్టన్‌ను హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, పూనే, లుథియానా, పాటియాలా, ఛండీఘడ్ మార్కెట్లలో నేడు విడుదల చేసింది.
శాంగ్‌యాంగ్ రెక్స్టన్ హై-ఎండ్ ఎస్‌యూవీ రెండు వేరియంట్లలో (ఆర్ఎక్స్5, ఆర్ఎక్స్7), టూ-వీల్ డ్రైవ్ (4x2) మరియు ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్‌తో లభ్యమవుతుంది. ఈ రెండు వేరియంట్లు కూడా ప్రీమియం లుక్ అండ్ ఫీల్‌ను కలిగి ఉండటమే కాకుండా మంచి ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ ప్రీమియం ఎస్‌యూవీలో ఉండే ఫీచర్లపై ఓ లుక్కేయండి మరి..!

వేరియంట్స్
శాంగ్‌యాంగ్ రెక్స్టన్ హై-ఎండ్ ఎస్‌యూవీ రెండు వేరియంట్లలో (ఆర్ఎక్స్5, ఆర్ఎక్స్7), టూ-వీల్ డ్రైవ్ (4x2) మరియు ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్‌తో లభ్యమవుతుంది.

ప్రీమియం లెథర్ సీట్స్
నాణ్యమైన లెథర్‌తో చేయబడిన ప్రీమియం సాఫ్ట్ ఇంటీరియర్స్, డ్యూయెల్ టోన్ (బ్లాక్, బీజ్ కలర్స్ కాంబినేషన్) డ్యాష్‌బోర్డ్.

ఫ్లాట్ ఫోల్డింగ్ రియర్ సీట్స్
ఎక్కువ లగేజ్ స్థలం కోసం పూర్తిగా మడిచిపెట్టే సౌకర్యం కలిగిన సీట్లు

6-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
జిపిఎస్ నావిగేషన్, డివిడి, సిడి, ఎమ్‌పి3, ఎఫ్ఎమ్, యూఎస్‌బి సపోర్ట్‌తో కూడిన 6-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
బయటి వాతావరణానికి అనువుగా సర్దుబాటు అయ్యే పూర్తి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్

ఎలక్ట్రిక్ సన్‌రూఫ్
టిల్ట్/ఓపెన్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రిక్ సన్‌రూఫ్

స్టీరింగ్ వీల్‌పై కంట్రోల్స్
స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్ (ఆటోమేటిక్ వేరియంట్‌లో గేర్ షిఫ్ట్ కంట్రోల్స్ కూడా ఉంటాయి), క్రూయిజ్ కంట్రోల్

బ్రేక్, యాక్సిలరేటర్ పెడల్స్
బ్రేక్, యాక్సిలరేటర్ పెడల్స్ మరియు రెస్ట్ పెడల్ (ఆటోమేటిక్ వేరియంట్‌లో)

అల్లాయ్ వీల్స్
10-స్పోక్ అల్లాయ్ వీల్స్

ఎల్‌ఈడి టెయిల్ ల్యాంప్స్
ఎల్‌ఈడి టెయిల్ ల్యాంప్స్ మరియు హైమౌంట్ బ్రేక్ లైట్

లైట్స్ అండ్ గ్రిల్
ఎల్ షేప్ పార్కింగ్ లైట్లతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ మరియు క్రోమ్ రేడియేటర్ గ్రిల్

రియర్ ఏసి వెంట్స్
రెండవ వరుసలో కూర్చునే ప్రయాణికుల సౌకర్యం కోసం, డ్రైవర్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లకు మధ్యలో ఏర్పాటు చేసిన రియర్ ఏసి వెంట్స్

రియర్ ఏసి వెంట్స్
మూవ వరుసలో కూర్చునే ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఏసి వెంట్స్

2వ వరుస సీట్లు
రెండవ వరుసలో ముగ్గురు ప్రయాణికులు కూర్చునేలా ఏర్పాటు చేసిన 60:40 స్ప్లిట్ రియర్ సీట్స్

3వ వరుస సీట్లు
ఇద్దరు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చునేలా ఏర్పాటు చేసిన 3వ వరుస సీట్. అవసరం లేదనుకుంటే దీనిని పూర్తిగా మడిచిపెట్టి, ఆ స్థలాన్ని లగేజ్ కోసం వినియోగించుకోవచ్చు.

బూట్ స్పేస్
లగేజ్‌ను స్టోర్ చేసుకునేందుకు విశాలమైన బూట్ స్పేస్

టూల్‌కిట్ స్పేస్
జాకీ, టూల్‌కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్‌లను భద్రపరచుకునేందుకు వీలుగా బూట్‌లో ఏర్పాటు చేసిన టూల్‌కిట్ స్పేస్.

డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్
రెండు రంగుల కలయికతో కూడిన (బ్లాక్, బీజ్) ప్రీమియం డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్

క్రోమ్ డోర్ హ్యాండిల్స్
లోపలివైపు క్రోమ్ ఫినిష్‌తో కూడిన ఇన్‌సైడ్ డోర్ హ్యాండిల్స్

ఇంజన్
ఆర్ఎక్స్5 మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వేరియంట్‌లో అమర్చిన 2.7 లీటర్, 5-సిలిండర్, ఆర్ఎక్స్270ఎక్స్‌డిఐ ఇంజన్ గరిష్టంగా 162 బిహెచ్‌పిల శక్తిని, 340 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆర్ఎక్స్7 ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్‌లో అమర్చిన 2.7 లీటర్, 5-సిలిండర్, ఆర్ఎక్స్270ఎక్స్‌విటి డీజిల్ ఇంజన్ గరిష్టంగా 184 బిహెచ్‌పిల శక్తిని, 402 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కలర్స్
శాంగ్‌యాంగ్ రెక్స్టన్ నాలుగు ఆకర్షనీయమైన రంగులలో లభిస్తుంది, అవి:
శాటిన్ వైట్
మూన్‌డస్ట్ సిల్వర్
వోల్కానో బ్లాక్
ఓప్యులెంట్ పర్పల్

ధరలు:
హైదరాబాద్ మార్కెట్లో శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్5 ఎమ్‌టి - రూ. 18.00 లక్షలు
* శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్7 ఏటి ఏడబ్ల్యూడి - రూ. 20.04 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)
వీడియో
లగ్జరీ అండ్ కంఫర్ట్:
ప్రీమియం లెథర్ సీట్స్, డ్రైవర్ సౌకర్యాన్ని తగినట్లుగా సర్దుబాటుచేసుకునే 8-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, ఎక్కువ లగేజ్ స్థలం కోసం పూర్తిగా మడిచిపెట్టే సౌకర్యం కలిగిన సీట్లు (ఫ్లాట్ ఫోల్డింగ్ రియర్ సీట్స్), ఆటో డే అండ్ నైట్ ఇంటర్నల్ రియర్ వ్యూ మిర్రర్, రెండు రంగుల కలయికతో కూడిన (డ్యూయెల్ టోన్) ఇంటీరియర్స్.
టెక్నాలజీ:
5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఈ-ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, జిపిఎస్ నావిగేషన్, డివిడి, సిడి, ఎమ్‌పి3, ఎఫ్ఎమ్, యూఎస్‌బి సపోర్ట్‌తో కూడిన 6-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బయటి వాతావరణానికి అనువుగా సర్దుబాటు అయ్యే పూర్తి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్రైవర్ సీట్, ఓవిఆర్ఎమ్ (సైడ్ మిర్రర్స్) సర్దుబాటును స్టోర్ చేసి ఉంచే 3 మెమరీ ఫంక్షన్స్, టిల్ట్/ఓపెన్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్ (ఆటోమేటిక్ వేరియంట్‌లో గేర్ షిఫ్ట్ కంట్రోల్స్ కూడా ఉంటాయి), క్రూయిజ్ కంట్రోల్, వర్షం పడగానే ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యే వైపర్స్, బయటి కాంతి తగ్గగానే ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యే హెడ్‌ల్యాంప్స్, ఎల్ఐఈడి ఇండికేటర్లతో కూడిన పవర్ ఫోల్డబిల్ సైడ్ మిర్రర్స్.
పెర్ఫామెన్స్:
ఆర్ఎక్స్5 మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వేరియంట్‌లో అమర్చిన 2.7 లీటర్, 5-సిలిండర్, ఆర్ఎక్స్270ఎక్స్‌డిఐ ఇంజన్ గరిష్టంగా 162 బిహెచ్‌పిల శక్తిని, 340 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 180 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఆర్ఎక్స్7 ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్‌లో అమర్చిన 2.7 లీటర్, 5-సిలిండర్, ఆర్ఎక్స్270ఎక్స్‌విటి డీజిల్ ఇంజన్ గరిష్టంగా 184 బిహెచ్‌పిల శక్తిని, 402 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 194 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది.
సేఫ్టీ:
అత్యవసర సమయాల్లో అదుపు తప్పిన వాహనాన్ని నియంత్రణలోకి తెచ్చే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి), ముందు సీట్లలో కూర్చునే డ్రైవర్, ప్యాసింజర్‌లను అన్ని వైపుల నుంచి రక్షించే 4 ఎయిర్‌బ్యాగ్స్ (ఫ్రంట్, సైడ్), సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), కొండ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు రోడ్డుపై వాహనం జారిపోకుండా ఉండేందుకు సహకరించే హిల్ డిసెంట్ కంట్రోల్, యాంటీ స్లిప్ రెగ్యులేషన్ అండ్ యాక్టివ్ రోల్ఓవర్ ప్రొటెక్షన్, ఇంజన్ ఇమ్మొబిలైజర్.
మైలేజ్:
శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్5 ఎమ్‌టి 12.4 కెఎమ్‌పిఎల్ మైలేజీనిస్తుంది. శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్7 ఏటి ఏడబ్ల్యూడి 11.18 కెఎమ్‌పిఎల్ మైలేజీనిస్తుంది.
ధరలు:
హైదరాబాద్ మార్కెట్లో శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్5 ఎమ్‌టి - రూ. 18.00 లక్షలు
* శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్7 ఏటి ఏడబ్ల్యూడి - రూ. 20.04 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)
కలర్స్:
శాంగ్‌యాంగ్ రెక్స్టన్ నాలుగు ఆకర్షనీయమైన రంగులలో లభిస్తుంది, అవి:
1. శాటిన్ వైట్
2. మూన్‌డస్ట్ సిల్వర్
3. వోల్కానో బ్లాక్
4. ఓప్యులెంట్ పర్పల్


Click it and Unblock the Notifications








