అక్యురా టిఎస్ఎక్స్‌లో మార్క్ జుకెర్‌బర్గ్, ప్రిసిల్లాల జంట సవారీ!

అతి చిన్న వయస్సులోనే బిలియన్ డాలర్ల ఆస్తిని సంపాధించుకున్న, ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ 'ఫేస్‌బుక్' వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధి కారి (సీఈఓ) మార్క్ జుకెర్‌బర్క్ ఇటీవలే, తన ప్రియురాలు 'ప్రిసిల్లా ఛాన్'ను పెళ్లి చేసుకుని సరదా సరదాగా కాలం వెల్లబుచ్చుతున్న సంగతి తెలిసిందే. బిల్ గేట్స్ మాదిరిగా అనతి కాలంలోనే ఇంతటి గొప్ప పేరును సంపాధించుకున్న మార్క్ జుకెర్‌బర్క్ ఉపయోగించే కారు ఎంటో తెలుసుకోవాలని ఆటో ప్రియులకు కుతూహలంగానే ఉంటుంది.

కోట్లకు పడగెత్తిన మార్క్ జుకెర్‌బర్గ్ ఏ ఫెరారీ కారును లేదా పోర్షే కారునో లేదా బుగాటి వేరాన్ వంటి కార్లను కలిగి ఉంటాడనుకుంటే పొరపాటే. మార్క్ ఇవేవీ కాకుండా ఓ ఇన్ఫినిటీ కార్ (టొయోటా లగ్జరీ కార్ బ్రాండ్)ను ఉపయోగిస్తున్నాడు. అంతేకాకుండా.. మార్క్ జుకెర్‌బర్గ్, అతని గర్ల్ ఫ్రెండ్ ప్రిసిల్లా ఛాన్‌లకు అత్యంత ఇష్టమైన కారు "ఆక్యురా టిఎస్ఎక్స్". పెళ్లి కాకమునుపు వీరిద్దరూ ఈ కారులో తెగ షికార్లు కొట్టేవారట.


జపాన్‌కు చెందిన కార్ మేకర్ హోండా అందిస్తున్న ప్రీమియం కార్ బ్రాండే 'అక్యురా'. మార్క్ ఉపయోగిస్తున్న అక్యురా టిఎస్ఎక్స్ లగ్జరీ కారు లెక్సస్ ఐఎస్, ఆడి ఏ4, బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ వంటి కార్లతో పోటీపడుతుంది. ఈ ఎంట్రీ లెవల్ లగ్జరీ కారు ఖరీదు కేవలం రూ.30,000 డాలర్లు మాత్రమే (మన దేశ కరెన్సీలో సుమారు రూ.16,47,000 మాత్రమే).
అక్యురా టిఎస్ఎక్స్ ఫోటో గ్యాలరీ
ఖరీదు తక్కువైనంత మాత్రనా ఈ కారులో లగ్జరీ ఫీచర్లకు కొదవేమీ లేదు. లెథర్ ఇంటీరియర్స్, పవర్ మూన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 7-స్పీకర్ సౌండ్ సిస్టమ్, శాటిలైట్ రేడియో, బ్లూటూత్, హ్యండ్స్‌ ఫ్రీ లింక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఉపయోగించిన 2.4 లీటర్ ఇన్-లైన్ 4 సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 201 హెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. మ్యాన్యువల్‌గా గేర్‌లు మార్చుకోవాలనుకున్నప్పుడు స్టీరింగ్‌ వీల్‌పై ఉండే కంట్రోల్స్ ద్వారా గేర్లను మార్చుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 22, 2012, 13:22 [IST]
English summary
Facebook founder and CEO Mark Zuckerberg owns an Acura TSX, an entry-level luxury sedan from Honda's premium car division. It is powered by 2.4 litre in-line 4 cylinder engine which generates 201 hp peak power and 172 lb-ft torque. Acrua TSX is matted with a 5 -speed automatic transmission.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+