భారతదేశపు ఫేవరెట్ కారు మారుతి ఆల్టో అరుదైన రికార్డ్
దశాబ్దాల చరిత్ర కలిగిన దేశపు అగ్రగామి కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా నుండి హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న బుజ్జి కారు 'మారుతి ఆల్టో' మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. గత 2000 సంవత్సరంలో భారత రోడ్లపై పరుగులు పెట్టడం ప్రారంభించిన మారుతి ఆల్టో ఇప్పటి వరకూ 20 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడుపోయి ఓ అరుదైన అమ్మకాల మైలురాయిని అధిగమించింది.
కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్మడువుతున్న కారుగా పేరు తెచ్చుకున్న మారుతి ఆల్టో ఇండియాలోకి విడుదైలన 8 సంవత్సరాల 3 నెలల్లో 10 లక్షల మార్కును తాకి అత్యంత వేగంగా అమ్ముడవుతున్న మోడల్‌గా అప్పట్లో రికార్డు నెలకొల్పింది. అయితే, ప్రస్తుతం కేవలం 3 సంవత్సరాల 6 నెలల్లోనే తర్వాతి 10 లక్షల ఆల్టో మోడళ్లు అమ్ముడు పోయాయి. దీంతో ఇదివరకి ఆల్టో రికార్డును ఇప్పుడు బ్రేక్ చేసినట్లయింది.
అలాగే, 2010-11 సంవత్సరంలో 3 లక్షల కార్లు అమ్ముడుపోయిన ఘనత కూడా ఒక్క ఆల్టోకే దక్కింది. ఇదే రికార్డును 2011-12లో కూడా ఆల్టో నెలకొల్పడం విశేషం. ఈ సందర్భంగా మారుతి సుజుకి ఇండియా సీఓఓ (మార్కెటింగ్ అండ్ సేల్స్) మయాంక్ పారీక్ వ్యాఖ్యానిస్తూ.. ఆల్టో కారు యొక్క మెరుగైన మైలేజ్, కాంపాక్ట్ స్లీక్ డిజైన్, మంచి హ్యాండ్లింగ్, తక్కువ ధర, తక్కువ మెయింటినెన్స్ వంటి అంశాలే మొదటిసారి కారునుకొనుగోలకు ఇది బెస్ట్ ఆప్షన్ కావటానికి దోహదం చేశాయని, వినియోగదారుల హృదయాలను గెలుచుకున్న ఆల్టో, తన పెర్ఫామెన్స్‌తో వారిని సర్‌ప్రైజ్ చేస్తూనే ఉంటుందని అన్నారు.
మారుతి సుజుకి ఆల్టో విషయానికి వస్తే ఇది రెండు ఇంజన్ ఆప్షన్లలో మార్కెట్లో లభిస్తుంది. ఇందులో ఒకటి 800సీసీ పెట్రోల్ ఇంజన్, మరొకటి 1,000సీసీ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. మారుతి ఆల్టో ప్రారంభ ధర రూ.2.4 లక్షలు. మారుతి ఆల్టోలో సిఎన్‌జి కిట్‌ను కూడా అమర్చుకునే సౌలభ్యం ఉంటుంది. తక్కువ ధరలో ఓ మంచి ఫ్యామిలీ కార్ కావాలనుకునే వారికి మారుతి ఆల్టో ఎప్పటికీ ది బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. భారత మార్కెట్లో ప్రవేశించి 12 ఏళ్లలోనే ఇంతటి ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుందంటే మారుతి ఆల్టో కారును మంది విశ్వాసిస్తున్నారో ఇట్టే అర్థమైపోతుంది.


Click it and Unblock the Notifications








