ఎర్టిగా డిమాండ్ భేష్.. కానీ వెయిటింగ్ పీరియడే బేజార్..

మారుతి సుజుకి ఇండియా తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన బహుళ ప్రయోజన వాహనం ఎర్టిగాకు భారత మార్కెట్ నుండి అశేష ఆదరణ లభిస్తుంది. గతంలో మహీంద్రా అండ్ మహీంద్రా సరసమైన ధరకే, ప్రపంచ స్థాయి ఫీచర్లతో కూడిన విడుదల చేసిన ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ, మారుతి సుజుకి విడుదల చేసిన కొత్త స్విఫ్ట్ వంటి మోడళ్లు దేశీయ విపణిలో ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో, అలాగే మారుతి సుజుకి ఎర్టిగా కూడా మార్కెట్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాధించుకుంది.

ఆకర్షనీయమైన ధరతో మారుతి సజుకి తాజాగా విడుదల చేసిన ఎర్టిగా ఎమ్‌పివికు విడుదలైన మొదటి నెలలోనే 35,000 వకు పైగా బుకింగ్‌లను సొంతం చేసుకుందంటే, ఈ మోడల్‌కు ఉన్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. ఈ మోడల్‌కు గణనీయంగా పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంలో మారుతి సుజుకి ఇబ్బందులను ఎదుర్కుంటుంది. ఎర్టిగా ఎమ్‌పివి కోసం ఉత్పత్తికి మించి డిమాండ్ ఉండటంతో దీని వెయిటింగ్ పీరియడ్ కూడా పెరిగిపోతుంది. ప్రస్తుతం కొన్ని రకాల డీజిల్ వేరియంట్ ఎర్టిగా ఎమ్‌పివి వెయింటిగ్ పీరియడ్ ఆరు నెలల వరకూ ఉంటోంది.


మారుతి సుజుకి నెలకు 6,000 యూనిట్ల ఎర్టిగా ఎమ్‌పివిలను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం కంపెనీ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్ మోడళ్ల మాదిరిగానే ఎర్టిగా విషయంలో కూడా మారుతి సుజుకి అధిక వెయిటింగ్ పీరియడ్ సమస్యను ఎదుర్కుంటుంది. ఎర్టిగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కంపెనీ కృషి చేస్తోందని, అవసరమైతో మరో యూనిట్‌లో కూడా ఎర్టిగా ఉత్పత్తిని చేపడతామని మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) మయాంక్ పారీక్ తెలిపారు.

ఇదే సెగ్మెంట్లో జపనీస్ కార్ కంపెనీ టొయోటా అందిస్తున్న ఇన్నోవా, మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న కొత్త జైలో మోడళ్లను సవాల్ చేస్తూ రూ.5.89 లక్షల ప్రారంభ ధరకే మారుతి సుజుకి ఇండియా ఈ కొత్త ఎర్టిగా ఎమ్‌పివిని మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అన్ని ఫీచర్లతో కూడిన మారుతి సుజుకి ఎర్టిగా టాప్-ఎండ్ వేరియంట్ ధర కేవలం రూ.8.45 లక్షలుగా మాత్రమే ఉండే, టాప్-ఎండ్ వేరియంట్ టొయోటా ఇన్నోవా రూ.13.54 లక్షలు గానూ, మహీంద్రా జైలో రూ.10.47 లక్షలుగా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, May 21, 2012, 16:05 [IST]
English summary
The Maruti Suzuki Ertiga is undoubtedly a tell tale success for the Indian carmaker. The new car has surprised many people by the sheer number of bookings it has received within one month of its launch. We can say even Maruti Suzuki is pleasantly surprised by the response its latest MPV has garnered.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+