సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లోనూ ఆ రెండు బ్రాండ్లదే హవా

ఇందుకు చాలానే కారణాలున్నాయి, పెరుగుతున్న వడ్డీ రేట్లు, డీజిల్ కార్లు అధిక వెయింటింగ్ పీరియడ్ ఉండటం, పెరుగుతున్న పెట్రోల్ ధరలు ఫలితంగా పెరుగుతున్న కొత్త కార్ల ధరలు ఇవన్నీ కూడా కొనుగోలుదారులను సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ వైపు మొగ్గుచూపేలా చేస్తున్నాయి.
అంతేకాకుండా.. మార్కెట్లో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో తాజా మోడళ్లు వస్తుండటంతో కొనుగోలుదారులు కూడా తరచూ కార్లను మార్చడానికి ఇష్టపడుతుండటం వల్ల కూడా సెకండ్ హ్యాడ్ కార్ మార్కెట్ పరిమాణ గణనీయంగా పెరుగుతోంది.
ఒకప్పుడు కొన్ని ప్రత్యేక కంపెనీలు మాత్రమే సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయిస్తుంటే, ప్రస్తుతం దాదాపు అన్ని కార్ కంపెనీలు సెకండ్ హ్యాండ్ మార్కెట్లోకి ప్రవేశించి తమ స్వంత బ్రాండ్ వాహనలతో పాటుగా ఇతర బ్రాండ్ వాహనాలను కూడా విక్రయిస్తున్నాయి.
ప్రస్తుతం కొత్త కార్ మార్కెట్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న మారుతి సుజుకి, హ్యుందాయ్ బ్రాండ్‌లు, సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా తమ జోరును కొనసాగిస్తున్నాయి. స్థానిక సెకండ్ హ్యాండ్ కార్ డీలర్ తెలిపిన దాని ప్రకారం, తాము విక్రయించే ప్రతి 10 కార్లలో ఐదు కార్లు మారుతి సుజుకివి కానీ లేదా హ్యుందాయ్‌వి కానీ ఉన్నాయని తెలిపారు.
సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో కూడా ఈ రెండు బ్రాండ్‌లకు డిమాండ్ ఇంత భారీగా ఉండటానికి కారణం, వీటి ధరలు తక్కువగా ఉండటమే కాకుండా మంచి మైలేజ్‌ను కూడా ఇస్తూ, తక్కువ మెయింటినెన్స్ ఖర్చును ఉండటమే. ఈ మార్కెట్లో స్విఫ్ట్, ఆల్టో, శాంత్రో, యాక్సెంట్ వంటి మోడళ్లకు మంచి గిరాకీ ఉంటోంది. మొత్తమ్మీద చూస్తే సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్‌ను ఈ రెండు బ్రాండ్‌లే డామినేట్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








