లిమిటెడ్ ఎడిషన్ మారుతి ఆల్టో కె10 నైట్‌రేసర్ విడుదల
దేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా నుంచి అత్యధికంగా అమ్మడవుతున్న ఆల్టో కె10 (1000సీసీ వెర్షన్ ఆల్టో)లో ఓ సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. 'మారుతి సుజుకి ఆల్టో కె10 నైట్‌రేసర్' అనే పేరుతో కంపెనీ విడుదల చేసిన ఈ లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్‌లో ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఆల్టో కె10తో పోల్చుకుంటే 11 అధనపు ఫీచర్లు ఉన్నాయి. మారుతి సుజుకి అందిస్తున్న ఎల్ఎక్స్ఐ వేరియంట్ ఆల్టో కె10 11 అధనపు ఫీచర్లను జోడించి ఈ లిమిటెడ్ ఎడిషన్ ఆల్టో కె10 నైట్‌రేసర్‌ను కంపెనీ విడుదల చేసింది.
ఈ లిమిటెడ్ ఎడిషన్ కొత్త ఆల్టో కె10 నైట్‌రేసర్ ధర ప్రస్తుత ఆల్టో కె10 ఎల్ఎక్స్ఐ వేరియంట్ కన్నా రూ.13,490 మాత్రమే అధికం. రియర్ ఎండ్ స్పాయిలర్, ట్రెండీ నైట్‌రేసర్ బాడీ గ్రాఫిక్స్, ఫుల్ వీల్ కవర్స్, బాడీ సైడ్ మౌల్డింగ్స్, లెఫ్ట్ సైడ్ ఓవిఆర్ఎమ్ (సైడ్ మిర్రర్) వంటి ఎక్స్టీరియర్ మార్పులు కొత్త లిమిటెడ్ ఎడిషన్ మారుతి సుజుకి ఆల్టో కె10 నైట్‌రేసర్ సొంతం. అలాగే, ఇంటీరియర్స్‌లో కొత్త నైట్‌రేసర్ ఫ్యాబ్రిక్ సీట్ కవర్స్, రియర్ పార్సెల్ ట్రే, స్టీరింగ్ వీల్ కవర్ వంటి మార్పులు గమనించవచ్చు. ఈ ఫీచర్లకు అదనంగా, కొత్త ఆల్టో కె10 నైట్‌రేసర్‌లో యూఎస్‌బి సపోర్ట్‌తో కూడిన జెవిసి ఎమ్‌పి3 మ్యూజిక్ సిస్టమ్‌ను కూడా అమర్చారు.
మారుతి సుజుకి ఆల్టో కె10 మోడల్‌ను ఆగస్ట్ 2010లో మార్కెట్లో విడుదల చేసింది. 20 లక్షల ఆల్టో బ్రాండ్ అమ్మకాల మైలురాయిలో ఆల్టో కె10 మోడల్ కూడా కీలక పాత్రను పోషించింది. ఆల్టో కె10లో అమర్చిన 1000సీసీ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 68 పిఎస్‌ల శక్తిని ఆఫర్ చేయటమే కాుండా మెరుగైన మైలేజ్‌ను కూడా (కంపెనీ పేర్కొన్న దాని ప్రకారం, లీటరు పెట్రోలుకు 20.2 కి.మీ.) ఆఫర్ చేస్తుంది. భారత మార్కెట్లో ఆల్టో కె10 ధరలు రూ.3.20 లక్షల నుంచి 3.34 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications









