ఫ్యామిలీ కార్ అవార్డును గెలుచుకున్న మారుతి ఎర్టిగా
భారతదేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన బహుళ ప్రయోజన వాహనం (ఎమ్‌పివి) ఎర్టిగాకు మార్కెట్లో అశేష స్పందన లభిస్తోన్న సంగతి తెలిసిందే. పెద్ద కుటుంబాలకు చక్కగా సరిపోయే ఈ ఫ్యామిలీ కారుకు ఓ అరుదైన సత్కారం లభించింది. ప్రముఖ ఆటోమొబైల్ ప్రచురణ కంపెనీ బిబిసి టాప్‌గేర్ ఇండియా నుంచి "ఫ్యామిలీ కార్ ఆఫ్ ది ఇయర్ 2012" అవార్డును మారుతి సుజుకి ఎర్టిగా దక్కించుకుంది. ఈ అవార్డును భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియాఎమ్) అధ్యక్షుడు ఎస్ శాండిల్య చేతుల మీదుగా మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజనీరింగ్) సివి రామన్ అందుకున్నారు.
మూడు వరుసల సీటింగ్ (2+3+2), కాంపాక్ట్ డిజైన్‌తో కూడిన ఎర్టిగా, ఆటోమొబైల్ పరిశ్రమలో 'కాంపాక్ట్ ఎమ్‌పివి' అనే కొత్త విభాగాన్ని సృష్టించింది. ఇందులో తొలిసారిగా మారుతి సుజుకి అభివృద్ధి చేసిన 1.4 లీటర్ కె14 వివిటిఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 6000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 95 పిఎస్ (70 కి.వా.)ల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 130 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 16.02 కి.మీ. మైలేజీని ఇస్తుంది.
ఇక డీజిల్ వేరియంట్ ఎర్టిగా విషయానికి వస్తే, ఇందులో అమర్చిన 1.3 లీటర్ డిడిఐఎస్ సూపర్‌టర్బో విజిటి డీజిల్ ఇంజన్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 90 పిఎస్ (66 కి.వా.)ల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు డీజిల్‌కు 20.77 కి.మీ. మైలేజీని ఇస్తుంది. గడచిన ఏప్రిల్ నెలలో విడుదలైన మారుతి సుజుకి ఎర్టిగా ఇప్పటి వరకూ సుమారు 55,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి.

ఫ్యామిలీ కార్ అవార్డును గెలుచుకున్న మారుతి ఎర్టిగా
ప్రముఖ ఆటోమొబైల్ ప్రచురణ కంపెనీ బిబిసి టాప్‌గేర్ ఇండియా నుంచి "ఫ్యామిలీ కార్ ఆఫ్ ది ఇయర్ 2012" అవార్డును మారుతి సుజుకి ఎర్టిగా దక్కించుకుంది.

ఫ్యామిలీ కార్ అవార్డును గెలుచుకున్న మారుతి ఎర్టిగా
ఈ అవార్డును భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియాఎమ్) అధ్యక్షుడు ఎస్ శాండిల్య చేతుల మీదుగా మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజనీరింగ్) సివి రామన్ అందుకున్నారు.

మారుతి సుజుకి ఎర్టిగా
మారుతి సుజుకి ఇండియా తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన బహుళ ప్రయోజన వాహనం (ఎమ్‌పివి) ఎర్టిగాకు మార్కెట్లో అశేష స్పందన లభిస్తోన్న సంగతి తెలిసిందే.

మారుతి సుజుకి ఎర్టిగా
మూడు వరుసల సీటింగ్ (2+3+2), కాంపాక్ట్ డిజైన్‌తో కూడిన ఎర్టిగా, ఆటోమొబైల్ పరిశ్రమలో 'కాంపాక్ట్ ఎమ్‌పివి' అనే కొత్త విభాగాన్ని సృష్టించింది.

మారుతి సుజుకి ఎర్టిగా
మారుతి సుజుకి ఎర్టిగాలో కంపెనీ తొలిసారిగా అభివృద్ధి చేసిన 1.4 లీటర్ కె14 వివిటిఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

మారుతి సుజుకి ఎర్టిగా
మారుతి సుజుకి ఎర్టిగాలో ఉపయోగించిన 1.4 లీటర్ కె14 వివిటిఐ పెట్రోల్ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 95 పిఎస్ (70 కి.వా.)ల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 130 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మారుతి సుజుకి ఎర్టిగా - మైలేజ్
మారుతి సుజుకి ఎర్టిగా పెట్రోల్ వేరియంట్ లీటరు పెట్రోల్‌కు 16.02 కి.మీ. మైలేజీని ఇస్తుంది.

మారుతి సుజుకి ఎర్టిగా - డీజిల్
మారుతి సుజుకి ఎర్టిగా డీజిల్ వెర్షన్‌లో 1.3 లీటర్ డిడిఐఎస్ సూపర్‌టర్బో విజిటి డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

మారుతి సుజుకి ఎర్టిగా - డీజిల్
మారుతి సుజుకి ఎర్టిగా డీజిల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.3 లీటర్ డిడిఐఎస్ సూపర్‌టర్బో విజిటి డీజిల్ ఇంజన్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 90 పిఎస్ (66 కి.వా.)ల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మారుతి సుజుకి ఎర్టిగా - డీజిల్ మైలేజ్
డీజిల్ వెర్షన్ మారుతి సుజుకి ఎర్టిగా లీటరు డీజిల్‌కు 20.77 కి.మీ. మైలేజీని ఇస్తుంది.

మారుతి సుజుకి ఎర్టిగా - ధరలు
ఆరు వేరియంట్లలో లభ్యం కానున్న మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
* ఎర్టిగా ఎల్ఎక్స్ఐ (పెట్రోల్) - రూ.6.21 లక్షలు
* ఎర్టిగా విఎక్స్ఐ (పెట్రోల్) - రూ.6.93 లక్షలు
* ఎర్టిగా విఎక్స్ఐ ఏబిఎస్ (పెట్రోల్) - రూ.7.04 లక్షలు
* ఎర్టిగా జెడ్ఎక్స్ఐ (పెట్రోల్) - రూ.7.75 లక్షలు
* ఎర్టిగా ఎల్‌డిఐ (డీజిల్) - రూ.7.68 లక్షలు
* ఎర్టిగా విడిఐ (డీజిల్) - రూ.8.34 లక్షలు
* ఎర్టిగా జెడ్‌డిఐ (డీజిల్) రూ.9.01 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

మారుతి సుజుకి ఎర్టిగా - సేల్స్
గడచిన ఏప్రిల్ నెలలో విడుదలైన మారుతి సుజుకి ఎర్టిగా ఇప్పటి వరకూ సుమారు 55,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి.

మారుతి సుజుకి ఎర్టిగా - ఇంటీరియర్స్

మారుతి సుజుకి ఎర్టిగా - ఇంటీరియర్స్



Click it and Unblock the Notifications








